Sunday, October 29, 2023

The Chamcha Age Video

Poona Pact

నెలసరి - సరైనదేనోయ్

ఈ నెలసరి - సరైనదేనోయ్

సృష్టి, అమ్మ నుండి మొదలౌతుంది,

ఆడపిల్ల పుడితే వామ్మో అని కొందరు అనుకుంటారు, 
కానీ అమ్మ పుటింది అనే సంస్కృతీ మనది,
ఆడపిల్లని మహాలక్మితో పోలుస్తారు..... ఈ నేలను, ప్రకృతిని, దేశాన్ని, ఆకాశాన్ని, వెన్నెలని, అన్నిటిని అడపిల్లలాగే పోలుస్తారు, పిలుస్తారు.

ఆడపిల్ల 12 నుండి 16సంవస్సరాల నడుమ, మొదటిసారిగా ఋతుస్రావించినప్పుడు,
ఇంట్లో ఒక పండగే జరుగుతుంది,
తనకు చిరకటించి, ఊరందరికి భోజనం పెడతారు, ఎంతో గొప్పగా మనం ఈ సృష్టికి మూలం అయిన ఈ విషయాన్ని గొప్పగా పండగలగా నిర్వహించుకుంటున్నాం......



కానీ, ఈ మధ్య 
ఆడపిల్ల నెలసరి లో ఉంటే,
పీరియడ్స్ సమయంలో స్కూల్లో, కాలేజి లోకి రానివ్వక పోగా,
వారిని దూరం పెట్టి, 
ఎవరు పీరియడ్స్ లో ఉన్నారో, అని అందరి బట్టలు విప్పి చెక్ చేసిన దుర్భరమైన సంఘటనలు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం.....


ఇది సహించకూడని విషయం,
ఇది ఎ మతం ప్రబోధించినా అది సహించారానిది, అటువంటి ఆలోచలలను దరికిరనివ్వకండి

ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, 
అవకాశం ఇస్తే,
నింగి, నెల ఆకాశం ఎక్కడైనా దూసుకుపోతున్నారు,
ఈ విస్తృతమైన పోటీ ప్రపంచంలో 
ఎక్కడ తలొగ్గడం లేదు,
సునీత విలియమ్స్, పీటీయూష, ఇందిరాగాంధీ, కిరణ్ బేడీ, మాయావతి, మమత బెనిర్జీ, మాలవత్ పూర్ణ, పీవీ సింధు, నందిని, లక్ష్మీ స్వరో, టీనా దాబి, మేరీ కోమ్, సైననేహ్వాల్, జ్వాలాగుప్త, కల్పన చవ్లా, మేరీ క్యూరి, సవిత్రిబాయ్, ఫాతిమా షేక్, సరోజిని నాయుడు, లతమంగేష్కర్, ...... ఎలా ఎంతో మంది........ అందరూ ఆడపిల్లలు,
అందరూ ఈ దేశానికి మరింత వన్నె తెచ్చి, తీరంగపథకాన్ని నలుధిక్కులా చాటిన వారే....

అందరూ సంవస్సరానికి 12 వారాలు
ఈ క్షోభ అనుభవించిన మహాశయులే.....


అందుకే,
ఈ వివక్ష సరైనది కాదు....
 ఇక మనం
మకర మంచిదే అని celebrate చేసుకోవాలి....



ఈ నెలసరి సరైనది.
మీ ఆలోచన కాదు:;

ఆరోగ్యకరమైన ఆలోచనలకు సలాం,
ఆడపిల్ల కాదేవారికి గులాం.

మార్చ్ 8 womens Day
Yours Srujan K

Monday, July 18, 2022

బహుజన యోధుడు: మన్యవర్ కాన్షీరాం

 అది 1957,, జీవితంలో ఎన్నో సంఘర్షణలు పడి, అవమానాలు ఎదుర్కొని, కష్టపడి, DRDO (Defence Research and Development Organization)లో, 24 సంవత్సరాల నవ యువకుడిగా ఉద్యోగంలో చేరారు కాన్షిరాం.. మహారాష్ట్రలోని, పుణె పట్టణంలో పోస్టింగ్ రావడంతో, తనకు ఎంతో ఇష్టమైన,, తనను కష్టపడి పెంచిన తన తల్లిని, వదలి రాలేక,, కళ్ళ నిండా నీళ్లతో, గుండె నిండా భారంతో పుణె చేరారు కాన్షిరాం.. 
      
సిక్కు మతంలో, కుల వివక్షకు వ్యతిరేకంగా పుట్టిన, రమదాసియా సిక్కు శాఖ, ప్రభావంతో,, చిన్నప్పటి నుండి,, ఆథ్యాద్మిక దారిలో పెరిగిన,, కాన్షిరం,, పుణె వచ్చి రాగానే, తనకు దగ్గరలోని గురుద్వారా ల గురించి ఆరా తీయడం మొదలెట్టారు.. కానీ పుణె పట్టణంలో చూస్తే అంతా చిత్రమైన పరిస్థితి ఉండేది.. ఆఫీస్ లోను, బయటా ఏ దళితుడిని పలుకరించినా, జై భీమ్ అని మొదలుపెట్టి, జై భీమ్ అని ముగించే వాళ్ళు,, ఎవరో బాబా(బాబాసాహెబ్) పేరు విరివిగా వాడేవాళ్ళు.. మొదట్లో ఆయనకు ఇదంతా కొత్తగా అనిపించేది,, ఈ బాబా ఎవరో, గురు రామదాస్ గారికంటే పెద్ద ఆధ్యాత్మిక గురువు లాగా ఉన్నాడే, అనుకునే వారు.. DRDO లో దళిత సంఘాల కార్యకలాపాలు, నినాదాలు, మొదట్లో ఇవన్నీ కొత్తగా ఉండేది..

      ఇదంతా ఒక వైపు అయితే మరోవైపు,, తాను ఈసారి సెలవులకు వస్తే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానని,, కాబట్టి ఎక్కువ సెలవులు పెట్టుకుని రావాలని, కాన్షిరాం గారి తల్లి, ప్రతి ఉత్తరంలో, చెబుతుండేది,, ఈసారి తన తల్లి మాట విని తప్పకుండా పెళ్ళి చేసుకుంటానని, బెంగ పడవద్దని, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోమని, తల్లిని సముదాయిస్తూ, కాన్షిరం గారు ఉత్తరం రాసేవారు..

కాన్షిరాం గారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన: 

        ఈ క్రమంలో ఉండగా, అది 1963 DRDO మొత్తంలో ఒక్కసారిగా హడావిడి మొదలైంది,, దళిత సంఘాలన్నీ ఒకే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు,,, ""ఎవరో ఒక 26 సంవత్సరాల మహర్ కుర్రాడు బాబాసాహెబ్ పుట్టిన రోజుకి సెలవు ఇవ్వాలని,, బాల గంగాధర్ జయంతికి, దీపావళికి సెలవులు ఇస్తూ బాబాసాహెబ్ పుట్టిన రోజుకు సెలవు ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని,, బాబాసాహెబ్ జయంతికి సెలవు ఇవ్వకపోతే,, తాను ఉద్యోగానికి రాజీనామా ఇస్తానని, DRDO యాజమాన్యాన్ని బెదిరించడంతో, అతన్నీ DRDO యాజమాన్యం సస్పెండ్ చేసిందట"".. ఆ యువకుడి పెరు "దిన భాన"(ముగ్గురు BAMCEF వ్యవస్థాపకుల్లో ఒకరు).. అతని తరపున All India Federation of Scheduled Caste/Tribes Backward Class & Minorities Employees Welfare Associations, న్యాయ పోరాటానికి దిగింది.. 
         కాన్షిరం గారిలో ఉత్సుకత మొదలైనది,, ఒక వ్యక్తి పుట్టిన రోజు సెలవు కోసం ఇంత పెద్ద ఉద్యమమా,, అసలు ఎవరు ఈ బాబాసాహెబ్ అనే సందేహం మనసుని తొలిచివేయసాగింది.. తాను ఆ మహా ఉద్యమంలో పాల్గొనాలని బలంగా అనిపించింది.. చిన్నప్పటి నుండి ఏ పని చేసినా,, 100% నిబద్ధతతో నిజాయితీగా చేయడం తన తండ్రి దగ్గర నుండి నేర్చుకున్న కాన్షిరాం,, ఆ ఉద్యమంలో పని చేయడం మొదలెట్టారు.. ఆ క్రమంలో ఒక మహార్ బౌద్ధ యువకుడు, కాన్షిరాం లోని కసి, సంకల్ప బలాన్ని గుర్తించి, అతనికి దగ్గర అయ్యాడు.. అతని పేరు,, D. K. కపర్డే (ముగ్గురు BAMCEF వ్యవస్థాపకుల్లో ఒకరు)..
          ఆయన్ని కాన్షిరాం ఉత్సాహంగా బాబాసాహెబ్ గురించి అడగడం మొదలెట్టారు.. ఆయన పుట్టిన రోజు కోసం ఇంత పెద్ద ఉద్యమం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని అడిగారు. కపర్డే నవ్వుతూ చెప్పారు,, ""ఆయన ఆధ్యాత్మిక గురువు కాదు,, ఆయన పూర్తి పేరు బాబాసాహెబ్ అంబెడ్కర్,, నువ్వు నేను ఇక్కడ ఉన్న వీళ్ళందరూ, ఇక్కడ ఉద్యోగం చేయడమే కాదు,, హుందాగా రోడ్డు మీద నడుస్తున్నాం అంటే, మంచి బట్టలు వేసుకుని, గౌరవప్రదమైన జీవితాలు గడుపుతున్నాం అంటే అది ఆయన ఇచ్చిన బిక్షే"" అని చెప్పసాగారు..
           అప్పటిదాకా దళితులకు రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దళితులకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ,, అంటరానితనం నిర్ములనకు హరిజనోద్ధరణ చేసింది గాంధీ,, అని పంజాబ్ లో ప్రచారంలో ఉన్న విషయాలనే నమ్ముతూ,, కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉన్న కాన్షిరాం లో, మరింత అలజడి మొదలైంది.. బాబాసాహెబ్ అంబెడ్కర్ గురించి మరింతగా తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగింది కాన్షిరాం గారికి.. దాని గమనించిన కపర్డే గారు కాన్షిరాం కు, బాబాసాహెబ్ రాసిన ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చారు.. దాన్ని పేరు "కుల నిర్ములన" (Annihilation of Caste) Every BAMCEF Cadre should read this Book.

మొదట్లో దాన్నీ ఒక మాములు పుస్తకంగా భావించి పేజీలు తిప్పిన కాన్షిరాం గారికి ఏమి అర్థం కాలేదు.. తరువాత రోజు ఆఫీసులో అదే విషయాన్ని దిన భాన, కపర్డే లతో చెప్పారు కాన్షిరాం.. వాళ్ళు దాని చారిత్రక నేపథ్యం చెప్పసాగారు.. నిజానికి అది పుస్తకం కాదు అని,, అది ఒక ప్రసంగంలోని పాఠం అని,, "జాత్ పాత్ తొడక్ మండల్" అనే ఒక హేతువాద సామ్యవాద సంఘం వాళ్ళు, బాబాసాహెబ్ ను ఒక సమావేశానికి ఆహ్వానిస్తే, దానికోసం తయారు చేసుకున్న ప్రసంగం అని,, అది ముందుగా వాళ్లకు పంపిస్తే, వాళ్ళు, ఇందులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే, కొన్ని సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బ తింటాయి అని, సమాజంలో అలజడి రేజ్ ప్రమాదం ఉంది అని సాకులు చెబుతూ, కొన్ని లైన్లు తొలగించి ప్రసంగించాలని, బాబాసాహెబ్ ను కోరడంతో,, బాబాసాహెబ్, అందులో ఒక్క లైన్ కాదు కదా,, ఒక్క కామా కూడా మార్చను అంటూ, ఆ సమావేశాన్ని బహిష్కరించి, ఆ ప్రసంగాన్ని ఒక పుస్తకం రూపంలో అచ్చు వేయించారు"" అని చెప్పారు..

       ఆ రోజు రాత్రి అంతా మేలుకొని, ఆ పుస్తకాన్ని, 3 సార్లు చదివారు కాన్షిరాం.. తాను చూసిన సమాజమే,, తనకు ఎదురైన పరిస్థితులే,, కానీ,, తాను ఎప్పుడు ఆలోచించని రీతిలో,, అసలు తన ఆలోచనకే అందని రీతిలో, ఒక క్రమబద్ధంగా పేర్చి, తన ఎన్నో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కళ్ళకు కట్టినట్టు అనిపించింది.. చదివినంత సేపు రోమాలు నిక్కబొడుచుకుంటూనే ఉన్నాయి,, శరీరాన్ని ఎదో కొత్త శక్తి ఆవరించినట్లు అనిపించింది.. ఎదో సాధించాలి,, ఎదో మార్పు తీసుకురావాలి,, ఈ సమాజానికి ఎదో చేయాలి అని మనసు పరితపించడం మొదలైంది,, 

       తరువాత రోజు దిన భాన, కపర్డే దగ్గర ఉన్న మరిన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించిన పుస్తకాలు తెచ్చుకుని,, 24 రోజులు సెలవులు పెట్టి చదివారు కాన్షిరాం.. ఈ 24 రోజుల్లో, కొన్ని రోజులు రోజంతా కన్నీళ్లతో ఏడుస్తూ గడిపాడు,, కొన్ని రోజులు అన్నం కూడా తినకుండా చదువుతూ గడిపాడు,, 24 వ రోజున తన తల్లికి ఒక ఉత్తరం రాసారు కాన్షిరాం..

      అమ్మా.. నేను ఇవాళ ఒక మహా వ్యక్తి గురించి తెలుసుకున్నాను.. అంటరాని ప్రజల భవిష్యత్తుకోసం, పీడిత జాతి ముందడుగు కోసం, తన భార్య, నలుగురు పసి పిల్లలు ప్రాణాలు పణంగా పెట్టి, తన జీవితాన్ని ధారపోసిన ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబెడ్కర్ దారిలో నేను నడవాలి అని నిర్ణయించుకున్నాను.. అమ్మా,, ఇక నాకు పెళ్లి సంబంధాలు వెతకడం మానెయ్యి,, నాకు సంపాదనతో ఆస్తులు కూడబెట్టాలి అనే ఆలోచన లేదు,, నా జీవితం, నా సమయం, నా శక్తీ, నా యుక్తి ద్వారా సాధించిన ప్రతి ఫలం, బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దేశించిన లక్ష్యాల కోసమే నేను ఉపయోగిస్తాను అని నేను నిర్ణయం తీసుకున్నాను.. అమ్మ, ఇకపైన నేను నిన్ను చూడడానికి, మన ఇంటికి కూడా రాకపోవచ్చు,, నీ మనసుకు క్షోభ కలిగిస్తున్నందుకు నన్ను క్షమించి అమ్మ.
ఇది ఆ లేఖ సారాంశం...

 కాన్షీరామే లేకపోతే ఈ దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీలకు రాజకీయం అనే మాటే తెలీదు చెంచాగిరి చేయడం తప్ప.
- కాన్షీరాం లేకపోతే అంబేడ్కర్ కు భారతరత్న ఇచ్చేవారే కాదు.

చరిత్రలో మానవులుగా మనుషులతో మన సమాన హక్కుల కోసం పోరాడిన సాధించిన పూలే అంబేడ్కర్, పెరియార్ లాంటి మహానుభావుల ఫోటోలు పెట్టుకొని దేశమంతా పిచ్చివాడిలా తిరిగిన యోధుడు.

రాజకీయరంగంలో చెంచాలుగా మాత్రమే ఉన్న ఎస్సీ, ఎస్టీ,లకు, ఉనికే లేని బీసీలకు మైనారిటీలకు ఒక బీఎస్పీ పార్టీ ఏర్పాటు చేసి వారిని మొట్టమొదటిసారిగా సొంత కాళ్లపై అసెంబ్లీ పార్లమెంట్ మెట్లు ఎక్కించిన వీరాధివీరుడు.

మీరు(దళితులు) పాలక సమాజంగా మారనంతకాలం అవమానించబడుతూనే ఉంటారు అని భవిష్యత్ తరాలను హెచ్చరించిన యోధుడు మన్యవర్ కాన్షీరాం గారు.

Sunday, July 17, 2022

భారత దేశంలోని రాజకీయ పార్టీలు


మనదేశంలో స్వాతంత్య్రానికి పూర్వమే రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. 1885 లో కాంగ్రెస్‌ స్థాపనతో మన దేశంలో రాజకీయ పార్టీలు ఏర్పడి పనిచేయడం ప్రారంభించాయి. మొదటి దశలో కాంగ్రెస్‌ రాజకీయ పార్టీగా కాకుండా ఒక ఉద్యమంగా ఉండేది. 1920 కి పూర్వం దేశంలో రాజకీయపరమైన పార్టీలు లేవనే చెప్పవచ్చు. 1919లో మాంటేగ్‌ చేమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల ఆధారంగా జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన స్వరాజ్య పార్టీ కాని, ఎన్నికలను బహిష్కరించిన కాంగ్రెస్‌ పార్టీ కాని ఈనాటి పార్టీల స్వభావం కలిగిలేవు. భారత జాతీయ కాంగ్రెస్‌తో పాటు ముస్లిమ్‌ లీగ్‌, హిందూ మహాసభ, భారత కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్‌ సోషలిస్టు పార్టీలు స్వాతంత్య్రానికి ముందే స్థాపించబడ్డాయి. స్వాతంత్య్రానంతరం అనేక నూతన పార్టీలు ఉద్భవించాయి.

భారత రాజకీయ పార్టీలను స్థూలంగా జాతీయ, ప్రాంతీయ పార్టీలుగా వర్గీకరించవచ్చు.

జాతీయపార్టీగా గుర్తింపు పొందుటకు కావల్సిన అర్హతలు:

1. లోక్‌సభ ఎన్నికలలో లేదా రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో 6% పొందాలి. ఈ ఓట్లు అనేవి నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో పొంది ఉండాలి.
పై వాటితో పాటు లోక్‌సభ ఎన్నికలలో కనీసం 4 స్థానాలను ఒక రాష్ట్రం నుంచి కాని అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో గెలుపొందాలి.
(లేదా)
2. లోక్‌సభ ఎన్నికలలో కనీసం 2% సీట్లను మూడు భిన్న రాష్ట్రాల నుంచి గెలుపొందాలి.
(లేదా)
3. ఒక పార్టీ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీగా గెలుపొందాలి.

ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందాలి అంటే

1. ఎ) లోక్‌సభ లేదా రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో పోలై చెల్లిన ఓట్లలో 6% ఓట్లను ఆ రాష్ట్రంలో పొందాలి.
బి) ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికలలో కనీసం రెండు స్థానాలను గెలుపొందాలి. లేదా ఒక లోక్‌సభ స్థానాన్ని గెలుపొందాలి.
(లేదా)
2. ఆ రాష్ట్ర శాసన సభకు జరిగిన ఎన్నికలలో 3% సీట్లను లేదా మూడు సీట్లను గాని గెలుపొందాలి. (ఏది ఎక్కువ అయితే అది).
(లేదా)
3. రాష్ట్రంలోని ప్రతి 25 లోక్‌సభ స్థానాలకు ఒక స్థానాన్ని గెలుపొందాలి.

మెజారిటీ పార్టీకి పరిపాలించే అధికారం ఉన్నట్లే ప్రతిపక్షాలకు అధికార పార్టీ లోటుపాట్లను ఎత్తిచూపి, దాని విధానాలను వ్యతిరేకించి, అధికార పీఠం నుంచి దాన్ని పడగొట్టే హక్కు ఉంటుంది. అధికార పక్షం లోపాలను బహిర్గతం చేసి ప్రజా బాహుళ్యానికి తెలియపరచడంలో ప్రతిపక్షాలు కీలకపాత్రను నిర్వహిస్తాయి.

గేబ్రియల్‌ ఆల్‌మండ్‌ చెప్పినట్లు “రాజకీయ పార్టీలు ప్రయోజనాన్ని సమీకరించే సంస్థలుగా, ప్రజాభిప్రాయానికి మెరుగులు దిద్దే సంస్థలుగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రజల తీర్పును కోరే సంస్థలుగాను పనిచేస్తాయి”.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నుండి భారత దేశాన్ని ఏ సామాజిక వర్గం పాలించింది అనేది తెలుసుకుందాం.

1 = 1947 జవహర్‌లాల్ నెహ్రూ (బ్రాహ్మణ)
2 = 1964 గుల్జారిలాల్ నందా(బ్రాహ్మణ)
3 = 1964 లాల్ బహదూర్ శాస్త్రి(బ్రాహ్మణ)
4 = 1966 గుల్జారిలాల్ నందా(బ్రాహ్మణ)
5 = 1966 ఇందిరా గాంధీ(బ్రాహ్మణ)
6 = 1977 మొరార్జీ దేశాయ్(బ్రాహ్మణ)
7 = 1979 చరణ్ సింగ్(బ్రాహ్మణ)
8 = 1980 ఇందిరా గాంధీ(బ్రాహ్మణ)
9 = 1984 రాజీవ్ గాంధీ(బ్రాహ్మణ)
10 = 1989 విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(బ్రాహ్మణ)
11 = 1990 చంద్రశేఖర్(బ్రాహ్మణ)
12 = 1991 పివి నరసింహారావు(బ్రాహ్మణ)
13 = అటల్ బిహారీ వాజ్‌పేయి(బ్రాహ్మణ)
14 = 1996 ఎ. డి. దేవేగౌడ(ఒబిసి)
15 = 1997 ఐకె గుజ్రాల్(బ్రాహ్మణ)
16 = 1998 అటల్ బిహారీ వాజ్‌పేయి(బ్రాహ్మణ)
17 = 2004 డాక్టర్ మన్మోహన్ సింగ్(సిక్కు)
18 = 2014 నుండి నరేంద్ర మోడీ(బిసీ ముసుగులో ఉన్న వైశ్యా)

భారతదేశంలో నూటికి 50 శాతం పైగా ఒబిసిలున్నారు. ఇక ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కలిసి 35 లేదా 45 శాతం ఉంటారు. మరి మూడు శాతం కూడా లేని బ్రాహ్మణులు ప్రధానమంత్రులు ఎందుకు అవుతున్నారు. కారణం మన దేశంలో రాజకీయ పార్టీల తరపున ప్రధానమంత్రి నామినేట్ చేయబడతారు. జాతీయ పార్టీల నుంచి ప్రధానమంత్రులు అవుతున్నారు. జాతీయ పార్టీలన్నీ బ్రాహ్మణ, బనియా(వైశ్యా), క్షత్రియుల కోసం ఏర్పాటు చేసుకున్నవేనన్న నిజాన్ని నూటికి తొంబై శాతం జనాభా గల ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనారిటీలు తెలుసుకోలేక పోతోన్నారు. బ్రాహ్మణ పార్టీలకే ఓట్లు వేస్తోన్నారు. కాంగ్రెస్ పార్టీ , బిజెపి, తృణమూల్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఇవన్నీ బ్రాహ్మణులు తమ మనువాద సిద్ధాంతాలకు ఎక్కడ భంగం కలుగుతుందోననే భయంతో, ముందు జాగ్రత్తగా తమ మనుగడ కోసం చైతన్యంతో ఏర్పాటు చేసుకున్నవే ఈ జాతీయ పార్టీలు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు గత 60 సంవత్సరాలుగా.

రెడ్డి (33-38years)
B. గోపాల "రెడ్డి"----1.5 years
N. సంజీవ "రెడ్డి" ----6 years
K. బ్రహ్మానంద "రెడ్డి" ---7.5 years
M. చెన్నా "రెడ్డి" ---3.5 years
B. వెంకటరామ "రెడ్డి" --7 months
K. విజయభాస్కర్ "రెడ్డి" -- 2.5 years
N. జనార్ధన్ "రెడ్డి" --2 years
YS. రాజశేఖర "రెడ్డి" -- 5.4years
N. కిరణ్ కుమార్ "రెడ్డి" --3.4 years
YS. జగన్మోహన్ "రెడ్డి"--ప్రస్తుతం

కమ్మ (20years)
N. రామారావు--6years
N. భాస్కర్ రావు--1 month
N. చంద్రబాబు నాయుడు---14years

బ్రాహ్మణ (3.5years)
T. ప్రకాశం ---1year
PV. నరసింహారావు---1.4years

D. సంజీవయ్య---2years(దళిత)
T. అంజయ్య---1.3years(రెడ్డి)
జలగం వెంగలరావు---4.3years(వెలమ)
K. రోశయ్య---1year( vysshya)

తెలంగాణ ముఖ్యమంత్రి : కెసిఆర్ (వెలమ)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు .

మిత్రులారా ఈ దేశ రాజకీయ ముఖచిత్రం బ్రాహ్మణీయ కుల వ్యవస్థ రూపొందించిన విధంగానే నడుస్తుంది అనడానికి ఇవే ఉదాహరణలు...

ఇవన్నీ చూస్తే ఆ మహనీయుడు ఎందుకు “Political Power is the Master Key…”అన్నాడో మాన్యవర్ కాన్షిరాం గారు ఆ power కోసం జీవితాన్ని ఎందుకు త్యాగం చేసాడో ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతుంది..

బాబాసాహెబ్ రాజకీయోద్యమం

బాబాసాహెబ్ తన 29 వ ఏటనే ఒక రాజకీయ నాయకునిగా emerge కావడం జరిగింది . 

   1920 నుండి 1935 వరకు సాధారణ స్థాయి ఉద్యమం
   సామాజిక, రాజకీయ అంశాలకు ప్రాధాన్యత
   అంటరాని/అణగారిన వర్గాలకు స్పృహ కల్పించడం
   చైతన్య పర్చడం , ఐక్యం చేయడం
 బహిష్కృత హితకారిణి సభ ద్వారా కార్యక్రమాలు

సౌత్‌బరో కమిటీ ముందు హాజరై ఒక విశాల ప్రాతిపదిక పై మూడు ముఖ్యమైన ప్రతిపాదనలు చేసారు :

1. అంట రాని కులాల పక్షాన తమ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు ఎన్నికకాకపోతే, అంటరానితనం నిర్మూలన కాదు. 
2. కౌన్సిళ్లలో అంటరాని కులాల ప్రజాప్రతినిధులు ఆధిపత్య కులాలకు సంబంధిం చిన మెజారిటీ సభ్యులని మించకూడదని, ప్రభుత్వమే అంటారని కులాల నుంచి తగు సమర్థులను ఎంపిక చేయాలని అంబేడ్కర్‌ వాదించారు. 
3. అంటరాని కులాలు రాజకీయంగా ఎదగాలంటే, వారి అభ్యర్థుల్ని వారే ఎన్నుకునే విధానం అమలు చేయాలని అంబేడ్కర్‌ కోరారు.
అంతేకాకుండా, ప్రతి పౌరుడికీ చదువు, సంపద కాకుండా ఓటింగ్‌ హక్కు ఉండాలని వాదించిన తొలి వ్యక్తి కూడా అంబేడ్కరే. అప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ స్థాపించి 34 ఏళ్ళు గడిచినప్పటికీ ఇటువంటి అత్యంత ప్రధానమైన రాజకీయ డిమాండ్‌ను చేసిన పాపాన పోలేదు.
[7/16, 8:28 PM] Arun BHEL buddhist: చత్రపతి సాహూమహారాజ్ ఆర్ధిక సహకారం మూలంగానే డాక్టర్ అంబేర్కర్ 'మూక్‌నాయక్ ప్రత్యేక సంచికను వెలువరించడం జరిగింది. 22 మార్చి 1920లో దక్కన్ అస్పృశ్య సమాజపు సమ్మెళనం జరిగింది. దానీకి అధ్యక్షత డాక్టర్ అంబేద్కర్ వహించగా సాహుమహారాజ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నాడు. సాహూజీ తన ప్రసంగంలో డాక్టర్ అంబేద్కర్‌ “మేదావులకే అలంకార ప్రాయమైనవాడు”. తమ ప్రజానికాన్ని ఉద్దరించడానికి అంకితమైన నిబద్దత కలవాడు. మీ నాయకున్ని మీరే వెతికిపట్టుకున్నారు. అందుకోసం మీక్కూడా ధన్యవాదాలు చెబుతున్నాను. మీ అభ్యున్నతి కోసం ఎల్లవేళలా కేవలం అంబేద్కరే కృషి చేస్తాడనే విశ్వాసం నాకు కలుగుతోంది. అంతేకాదు ఒకనాడు ఏదో సమయంలో అంబేద్కర్ అఖిలభారత నాయకుడవుతాడనే నమ్మకం నాకుంది. మీరంతా ఈ నాయకుడిని అనుసరించండని ఆదేశించడంతో కరతాళద్వనులతో ప్రజలంతా స్వాగతించారు. సాహూజీ భవిష్యవాణిని పలికి రాబోయో కాలంలో జరిగిన చరిత్రను కళ్లముందు చూపించాడు.

సైమన్ కమిషన్ : 

1927 వ సంవత్సరములో భారత దేశములోని అణచివేయబడ్డ ప్రజల తరగతి యొక్క స్థితిగతుల అధ్యయనము కోసమని సైమన్ గారి అధ్యక్షతలో ఒక కమీషన్ ను నియమించింది ఆంగ్లేయ ప్రభుత్వము. సైమన్ గారు స్వయాన అవిభక్త భారత దేశములోని లాహోర్ చేరుకున్నప్పుడు, కాంగ్రెస్ మరియు గాంధీ  అనుచరులు దేశము మొత్తములో అన్ని చోట్ల సైమన్ గారికి వ్యతిరేక ప్రదర్శనలు జరుపబడ్డాయి. లాహోర్ లో సైమన్ గారికి నల్ల జెండాలు చూపెడుతూ "సైమన్ వెనక్కి వెళ్ళిపో" అంటూ నినాదాలు ఇచ్చారు, ముందుకు సాగనివ్వలేదు. బాబాసాహెబ్ లాహోర్ చేరుకొని 400 పేజీల నిమ్నవర్గాల దీనావస్థలను గురించిన నివేదనా పత్రాన్ని సైమన్ కి సమర్పించారు.  కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో సైమంకి నిజానిజాలు తెలవనివ్వకుండా చేసేందుకు, ఆయన కళ్ళలో దుమ్ముకొట్టి మోసము చేసేందుకని కొంతమంది బ్రాహ్మణులతో దళిత బహుజనుల సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసింది. 

(సహపంక్తి భోజనాలలో పాలుగొన్న బ్రాహ్మణులు తరువాత తమ తమ ఇళ్లకు వెళ్లి గోమూత్రాన్ని త్రాగి, దానితో స్నానమాచరించి శుద్ధులవ్వడానికి ప్రయత్నించారు)

సౌత్ బొరో కమిటీ ప్రణాలికలను పూర్తి చేయటానికి అంటే ప్రజా స్వామ్య పరిపాలన నెలకొల్పడానికి 1928 లో సైమన్ కమిషన్ ఏర్పాటు చేశారు.

అంటే సైమన్ కమిషన్ మూలనివాసులకి (OBC, SC, ST) అందరితో సమానంగా అధికారాలు ఇవ్వటానికి భారత దేశం బయలుదేరింది.  దీనిని వ్యతిరేకిస్తూ గాంధీ సైమన్ గో బ్యాక్ అంటూ నినాదం లేపాడు, దీని అర్థం మూలనివాసులకి (OBC, SC, ST) మా తో సమానంగా అధికారాలు ఇవ్వటానికి మేము ఒప్పుకోము అని చెప్పటం. అంటే గాంధీ బ్రాహ్మణులకు మాత్రమే అధికారం ఉండాలి, శూద్రులకు (OBC, SC, ST) అధికారం ఇవ్వటానికి ఇష్టం లేదు, అంటే గాంధీ ఉద్దేశ్యం బానిసలు బానిసలుగా నే ఉండాలి .....

మన స్కూల్ పుస్తకాలలో మాత్రం సైమన్ గో బ్యాక్ అనేది స్వాతంత్ర్య పోరాటం కోసం గాంధీ చేసిన ఉద్యమం గా రాశారు.

ఇప్పుడు బ్రిటిష్ వారు అందరికి అధికారాలు ఇస్తానికి వస్తే, దీనిని బ్రాహ్మణులు మరియు గాంధీ ఎందుకు వ్యతిరేకించారో మనం ఆలోచించాలి. సైమన్ కమీషన్ నిజానికి (OBC, SC, ST, MINORITIES) కి ఉపయోగకరం కాని ఈ విషయాలను మరుగునపెట్టి లేని పోని విషయాలను తప్పుడు ప్రచారం చేశారు గాంధీ మరియు బ్రాహ్మణులు, వారు స్దాపించిన మీడియా ద్వారా. మీడియా లో వచ్చే ఈ ప్రచారాలు నమ్మి చాలా మంది గాంధీ వెనకాల వెళ్ళారు, అప్పటికే సత్య సోదక్ సమాజ్ ను కూల్చి OBC లను కాంగ్రెస్ లో కలిపేసుకున్నారు బ్రాహ్మణులు, చాలా వరకు మన అమాయకపు మూలనివాసులు ఈ తప్పుడు ప్రచారం నమ్మేశారు. 

బ్రిటిష్ వారికి కూడా చాలా కోపం వచ్చింది, మీ కోసం మేము వస్తే మా మీదే తప్పుడు ప్రచారం చేస్తారా? అని భారతీయ ప్రతినిధులనే వారి దగ్గరకు లండన్ రమ్మన్నారు...అవే 1930 - 1932 లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలు


రౌండ్ టేబుల్ సమావేశాలు :

రౌండ్ టేబుల్ సమావేశాలకు నామినేషన్లు సమర్పించినవారు వెళ్ళారు.  గాంధీ వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన చేసిన సైమన్ గో బ్యాక్, విజయవంతం అయ్యిందనుకున్నాడు. ముస్లిం లీగ్ ప్రతినిధి అయిన జిన్నా కూడా మొదటి, రెండవ  రౌండ్ టేబుల్  సమావేశాలు మాత్రమె హాజరయ్యారు. రౌండ్ టేబుల్ సమావేశాలు మొదలైనప్పుడు బాబా సాహెబ్ అంబేద్కర్ గారు తన యొక్క ప్రతిపాదనలు బ్రిటిష్ వారి ముందు ఉంచాడు.

ఆ ప్రతిపాదనలలో ముఖ్యమైనవి
1) Adult franchise (యుక్త వయస్సు వచ్చిన అందరికీ ఓటు హక్కు)
2) Adequate representation (జనాభా ప్రాతిపదికన సరిపడేంత ప్రాతినిధ్యం)
3) Separate electoral (ప్రత్యేక ఎన్నికలు)
4) Dual voting (రెండు ఓట్లు)
అన్ని వాదోపవాదాలు విని చర్చించిన తరువాత, బ్రిటిష్ వారు ఇవన్నీ సమంజసంగా ప్రజాస్వామ్య రీతిలో అందరికి సమానంగా ఉన్నాయని గ్రహించి కమ్యూనల్ అవార్డ్స్ అన్న పేరుతో డా: అంబేద్కర్ గారి ప్రతిపాదనలను ఆమోదించింది. అందరూ (OBC, SC, ST &MINORITIES) సంతోషించారు, ఎందుకంటే అందరికి సమాంతరంగా తమ ప్రతినిధులను తమ యొక్క సమస్యలను పార్లమెంటు లో విన్నవించుకునే అవకాసం కలిగింది.

అందరూ ఆనందిస్తుంటే, ఒక్కరు అడ్డుకున్నారు. ఆయనే మోహన్ దాస్ కరం చంద్ గాంధీ...
అదే పూనా ఒప్పందం రూపంలో నిజమైన బహుజన రాజకీయ ప్రాతినిద్యానికి గొడ్డలి పెట్టు.  పూనా ఒప్పందం ప్రాజాస్వామ్యానికి చావు దెబ్బ, అది బ్రాహ్మణులు మరియు గాంధీ కలిసి పన్నిన పన్నాగం.


(పూనా పాక్ట్ గురించి, బాబాసాహెబ్ రాజకీయ పోరాటం గురించి మరింత సమాచారం ముందు తరగతుల్లో చూద్దాం...)

Friday, July 15, 2022

E. ఆత్మగౌరవ ఉద్యమ పితమహులు: పెరియర్ EV రామస్వామి

ఆత్మగౌరవ నినాదం పెరియార్:                            

 'పెరియార్’ (పెద్దాయన) అని ప్రజల చేత ప్రేమగా పిలిపించుకున్న యి.వి. రామస్వామి నాయకర్( 1879-1973) దక్షిణాది రాస్ట్రాలలో గత శతాబ్దంలో జరిగిన అనేక ప్రత్యామ్నాయ వుద్యమాలకు చిరునామా.  సామాజిక దుర్నీతిపైన, కులతత్వ రాజకీయాలపైన, మతం తాలూకు మూఢ విశ్వాసాల పైన, సాంస్కృతిక విలువలపైన తన జీవిత కాలమంతా రాజీలేని పోరాటం చేసిన ఆయన దళిత బహుజనులకు నిజంగానే పెద్ద దిక్కుగా మిగిలాడు. రాజకీయ స్వాభిమానం, సాంఘిక స్వాభిమానం రెండూ చెట్టపట్టాలేసుకుని సాగుతాయని నమ్మిన పెరియార్ తన పోరాటాన్ని రాజకీయ రంగంతో పాటు సామాజిక, సాంస్కృతిక  రంగాలకు కూడా విస్తరింపజేశాడు.   
పెరియార్ 1919లో అప్పటి జాతీయ కాంగ్రెస్ లో చేరినప్పటికీ అతి కొద్దికాలంలోనే దాని పట్ల తన భ్రమలను తొలగించుకున్నాడు. 

కాంగ్రెస్ గొప్పగా చెప్పుకొనే జాతీయవాదం వొక మేడిపండు వంటిదని, దానినిండా కులతత్వ లుకలుకలు వున్నాయని జాతీయ కాంగ్రెస్ గుట్టు రట్టు చేసిన ధీశాలి పెరియార్. పుట్టుక ఆధారంగా కొందరిపైన వివక్షను కొనసాగించే వర్ణాశ్రమ ధర్మం లేని జాతీయవాదం కావాలని పెరియార్ జతీయవద భావనకు తనదైన వ్యాఖ్యానాన్నిచ్చాడు. అణగారిన కులాలలో బ్రాహ్మణేతర ద్రవిడ వుద్యమ స్పూర్తిని నింపడంలో పెరియార్ ఎన్నో మైలురాళ్ళను దాటాడు. ద్రవిడ వుద్యమం అంటే కేవలం తమిళులకు మాత్రమే పరిమితమైనది కాదని, ఆర్యేతరులంతా ద్రావిడులేనని, దురాక్రమదారులైన ఆర్యుల ఆధిపత్య భావజాలాన్ని వ్యతిరేకించే అణగారిన వర్గాలకు చెందిన దేశవ్యాప్త వుద్యమమని పెరియార్ ద్రావిడ సిద్ధాంతానికి అంబేడ్కర్ వో  విశాలమైన దృక్పధాన్ని అందించాడు. తనకు ఎంతో భావసారూప్యత గల పెరియార్ ను అంబేడ్కర్ 1944 లో కలుసుకున్నాడు. కాంగ్రెస్ మరియు గాంధీల హరిజనోధరణలోని డొల్లతనాన్ని అంబేడ్కర్ , పెరియార్ లు తమవైన పద్ధతులలో యెండగట్టారు.     

పెరియార్ కాంగెస్ పార్టీని విడిచి పెట్టాక తమిళనాడులోని బ్రాహ్మణేతర దళిత బహుజనులను సంఘటితం చేస్తూ పెద్ద యెత్తున వుద్యమాన్ని నిర్మించాడు. తన వుద్యమంలో యువకులను, స్త్రీలను క్రియాశీలక పాత్రధారులను చేశాడు. ఆయన నిర్వహించిన వుద్యమాలలో వైకోం పోరాటం ముఖ్యమైంది. ఆయన పూర్వీకుడు, తమిళ సామాజిక వుద్యమాలకు ఆద్యుడైన అయోతీదాస్ మీద గౌరవంతో  అయోతీదాస్ క్రియాశీలకంగా పనిచేసిన కోలార్  బంగారు గనుల ప్రాంతం నుంచి పెరియార్ తన కార్యక్రమాలను ప్రారంభించడం విశేషం.  అయోతీదాస్ అనుచరులలో అప్పాదురై,లక్ష్మీ నరుసులు పెరియార్ తో పాటు పనిచేశారు. పెరియార్ కి  హైందవేతర మతాలైన బౌద్ధం, యిస్లాం పట్ల గౌరవం వున్నప్పటికీ ఆయన నాస్తికుడిగానే గుర్తింపు పొందాడు. 
పెరియార్ కి సోషలిజం పట్ల కూడా ఎంతో అభిమానం  వుంది. అయితే ఆయన దాన్ని భారతీయ సామాజిక వాస్తవికతతో మాత్రమే ముడిపెట్టి చూడడం గమనార్హం. ఆయన నిర్మించిన బ్రాహ్మణేతర వుద్యమం రాజకీయంగా జస్టిస్ పార్టీ గా రూపొందింది. జస్టిస్ పార్టీ సోషలిస్ట్ సిద్ధాంత ప్రాతిపదికగా కింది  కులాలు పోగొట్టుకున్న యెన్నో అవకాశాలను తిరిగి యిచ్చింది. క్రమంగా యీ పార్టీ ‘ద్రవిడ కజగం’ గానూ, అన్నాదురై అనంతరం ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ గానూ పరిణామం చెందింది. పెరియార్ తన భావాల వ్యాప్తి కొరకు 'కుడి అరసు’ అనే పత్రికను ఏర్పాటు చేసి దానిలో ఎన్నో సంచలనాత్మక సంపాదకీయాలను, వ్యాసాలను ప్రచురించాడు. ఆయన అనేక గ్రంధాలు కూడా రచించి ద్రావిడ సిద్ధాంతాన్ని ముందుకు తీసికెళ్ళాడు. భాషా పరంగా హిందీ భాషను ద్రవిడులపైన రుద్దడాన్ని పెరియార్ వ్యతిరేకించాడు.     

పెరియార్ వో వైపు రాజకీయ పోరాటం చేస్తూ శూద్రులకు ఎన్నో అవకాశాలను, హక్కులను కల్పిస్తూనే మరోవైపు స్త్రీల పరంగా సంస్కణోద్యమాన్ని కొనసాగించాడు. ఆయన బ్రాహ్మణవాదం యే  రూపంలో వున్నా దాన్ని యెదుర్కొని  సమాజం సమూలంగా మార్పు చెందాలని భావించాడు. స్త్రీని వొకపక్క దేవతగా పూజించే హిందూమతం మరోపక్క ఆమెను దేవదాసిగా, వూరుమ్మడి వస్తువుగా దిగజార్చిందని హిందూ మతం యొక్క రెండు నాల్కల ధోరణిని ఎండగట్టాడు. స్త్రీకి ఆస్తి హక్కు, గర్భ నిరోధక హక్కు, జీవిత భాగస్వామిని ఎన్నుకునే స్వేచ్చ వుండాలని పెరియార్ వాదించాడు. వివాహ వ్యవస్థలో వున్న లొసుగులను చీల్చి చెండాడడమే కాకుండా ప్రజల వ్యక్తిత్వాలను గౌరవించే పెళ్ళిళ్ళు జరగాలని ప్రతిపాదించాడు. తాళిబొట్టు, కట్నకానుకలు, కులమతాలకు సంబంధం లేని వివాహాలను పెరియార్ తానే స్వయంగా నిర్వహించాడు. భూమి వొక ఆస్థిగా భావించని, దానిపై ప్రజలకు వ్యతిగత హక్కులులేని కాలంలో స్త్రీలపైన అణచివేత, బానిసత్వం, బలవంతపు వివాహాలు లేవని ఆయన అభిప్రాయం. స్త్రీలు, కుటుంబం, వ్యక్తిగత ఆస్థి వంటి అంశాలలో పెరియార్ ఆలోచనలు యెంగెల్స్,  అంబేడ్కర్ ఆలోచనలకు దగ్గరగానూ, ఆయన బ్రాహ్మణేతర దృక్పధం  ఫూలే దృక్పధానికీ దగ్గరగా అనిపిస్తాయి. ఆనాటి స్త్రీవిద్య స్త్రీలను మంచి వంటగత్తెలుగానూ, కుట్టు పనులు నేర్చుకునేవారిగానూ వెరసి 'మంచిభర్త’ కోసం ఏర్పాటు చేయబడినట్టుగానూ వుందని పెరియార్ వ్యంగ్యంగా పేర్కొనడం విశేషం. ఆయన అభిప్రాయాలు  యీ నాటి సమాజానికీ వర్తిస్తాయి.    

పెరియార్ నిర్మించిన స్వయంగౌరవ వుద్యమమం దక్షిణాదిన భాగ్యరెడ్డి వర్మ నాయకత్వంలో ఆది ఆంధ్ర వుద్యమానికి, ఆది కర్నాటక వుద్యమానికి ప్రేరణగా నిలిచింది. మైసూర్ లోని వొక్కలిగలు, లింగాయతులు, ముస్లింలు, కురుబలు తమకోసం సంఘాలు ఏర్పాటు చేసుకుని అస్థిత్వ పోరాటాలు ప్రారంభించడానికి పెరియార్ వుద్యమం దోహద పడిందనవచ్చు. పెరియార్ అనుచరులు బ్రాహ్మణేతర భావజాల చిహ్నాలను చెప్పులతో కొట్టి, దేవాలయాలను బహిష్కరించి, మనుస్మృతి  వంటి గ్రంధాలను తగలబెట్టేవారు. అయితే యీ వుద్యమం వలన చైతన్యవంతమైన శూద్ర బహుజన కులాలవారు ఆర్ధిక పరిపుష్టి పొందాక క్రమంగా బూర్జువా రాజకీయాలకు లోనవడమే కాకుండా దళితులపైన దాడులకు పాల్పడి పెరియార్ స్పూర్తికి దూరమయ్యారు. యీ క్రమం మహారాష్ట్రలోని కున్ బీల విషయంలో కూడా  జరిగింది. 2006 లో జరిగిన ఖైర్లాంజి సంఘటన దీనికి వుదాహరణ. 

తమిళనాడులో ఆర్యదేవతల దేవాలయాలు గాక అనార్య దేవతలు, మాతృదేవతల ఆలయాలే అధికంగా వుండడం వెనుక పెరియార్ వంటి ద్రావిడ వుద్యమకారుల ప్రభావం వుందనే చెప్పాలి. సమాజంలోని సమస్తమైన  రుగ్మతలు, ఆధిపత్య భావజాలానికి ప్రతీకలైన సంప్రదాయాలు సమూలంగా మారాలని భావించిన పెరియార్ తాను నమ్మిన సిద్ధాంతాన్ని అమలు పరచడానికి తన ఆస్థిని, సౌఖ్యాన్ని వదులుకొని సామాన్య జీవితాన్ని గడిపాడు. తన ప్రజలకు సామాజిక న్యాయం నిరాకరించే సమాజం ఆర్ధిక, రాజకీయ సమానత్వం కోసం పోరాడే శక్తిగల నాయకులను సృష్టించలేదని ఆయన భావన. ఆధిపత్య భావజాలం యెక్కడున్నా దానిని ప్రశ్నించి తీరాలన్న పెరియార్ ఆత్మగౌరవ వుద్యమాలకు 'పెద్దాయన’. ఆయన స్మృతి అణగారిన కులాల అస్థిత్వ పోరాటాలకు నిరంతరం స్పూర్తిదాయకంగా నిలుస్తుంది.


బహుజన హక్కులే మానవ హక్కులని నినదించిన ఈ బహుజనోద్యమకారుని జీవిత చరిత్ర గుర్తుకు చేసుకొని చైతన్య మూర్తులై , బహుజన రాజ్యాన్ని స్థాపిద్దాం ...

C. స్వామి నారాయణ గురు గౌడ్

స్వామి నారాయణ గురు (1855-1928)

మనదేశంలో నూటికి నూరు శాతం అక్షరాస్యతను సాధించిన రాష్ట్రం ఏదైనా వుందంటే అది ఒక్క కేరళ మాత్రమే! స్త్రీ విద్యలో ఆ రాష్ట్రం కమ్యూనిస్టు చైనా కంటే కూడా అగ్రస్థానంలో వుంది. ఇవాళ కేరళ నర్సులు లేని పెద్ద ఆసుపత్రి యావద్దేశంలో ఒక్కటి కూడా వుండదంటే అతిశయోక్తి కాదు. ఈ అద్భుత ప్రగతి వెనక అలనాడు అభ్యుదయ సామాజిక తత్వవేత్త శ్రీ నారాయణ గురు (1855-1928) చేసిన అపూర్వమైన కృషి ఎంతో వుంది.

ఆ రోజుల్లో వెనుకబడిన కులాల వారికి దేవాలయాల్లో ప్రవేశించే అర్హత వుండేదికాదు. దళితులకైతే దేవాలయాల చుట్టుపక్కలి వీధుల్లోకి, రహదార్లపైకి అడుగుపెట్టే అర్హత కూడా లేదు. అంటరానివాళ్ల నీడ సోకితేనే మైల పడతా మన్నట్టు అసహ్యించుకునేవారు బ్రాహ్మణులు. 

నంబూద్రీలు (బ్రాహ్మణులు) దైవాంశ సంభూతులు కాబట్టి వారు మాత్రమే దేవాలయంలోని గర్భగుడిలో తిరుగాడవచ్చు. అదే రాజ్యాన్ని పాలించే క్షత్రియులకు సైతం ఆ అర్హత లేదు. వారు గర్భగుడికి కనీసం రెండడుగుల దూరాన్ని పాటించాలి. నాయర్లు 16 అడుగుల దూరం, ఈళవ కులస్తులు 32 అడుగుల దూరం, పులయ మరియు పరయ కులస్థులు 64 అడుగుల దూరం పాటించాలి. ఇక నాయాదీలు (మాల మాదిగ తదితర దళిత కులస్తులు) దేవాలయం సంగతి అటుంచి, బ్రాహ్మణుల కనుచూపు మేరలో కూడా కనిపించకూడదు. పొరపాటున ఏ నాయాదినైనా బ్రాహ్మణుడు చూస్తే అతను ప్రాయశ్చిత్తం చేసుకోవలసి వుండేది. 
ఇవీ ఆనాడు (సవర్ణ) మనిషికీ ... (అవర్ణ) మనిషికీ మధ్య, (మనువాద) దేవాలయానికీ మనిషికీ మధ్య వున్న దూరం నియమాలు. దేవుడి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం వారి కులాలను బట్టి పై దూరాలతో విడివిడిగా క్యూ రైలింగ్‌లుండేవి. అంటే ఉదాహరణకి నాయర్లు దేవుడి విగ్రహాన్ని 16 అడుగుల దూరం నుంచి దర్శనం చేసుకోగలిగితే పులయ, పరయ కులస్థులు 64 అడుగుల దూరం నుంచి నిక్కినిక్కి చూస్తూ అస్పష్టంగా దర్శనం చేసుకోవలసి వచ్చేది. ఇక మాలమాదిగలకైతే ఆ దేవుడు ఎలావుంటాడో చూసే అవకాశమేలేదు. 
ఇంకా ఇట్లాంటి అమానుషమైన, అర్థ రహితమైన నియమ నిబంధనలు అనేకం వుండేవి. (వాటి గురించి ఈ పుస్తకంలో కొంతవరకు వివరంగానే ప్రస్తావించడం జరిగింది). ఈళవ తదితర వెనుకబడిన తరగతులకు చెందినవాళ్లు అడుగడుగునా అవమానాలు ఎదుర్కొంటూ కూడా దేవుడి విగ్రహాన్ని దర్శించుకునేందుకు నానా యాతనా పడేవారు. అగ్రవర్ణాల వారు ఆర్థికంగా బాగుండటానికి, తాము దారిద్య్రంతో కునారిల్లుతుండటానికి కారణం తమపై దైవానుగ్రహం లేకపోవడమే, తమకు దైవ దర్శనభాగ్యం లభించకపోవడమే కారణమని కుమిలి పోయేవారు!
ఈ నేపథ్యంలో ఈళవ కులంలో జన్మించిన శ్రీ నారాయణ గురు కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, ఆర్యనీకరణ వల్ల చోటుచేసుకున్న మూఢనమ్మకాలకు, దుస్సంప్రదాయాలకు, ఆచారాలకు, అగ్రవర్ణ దోపిడీపీడనలకు వ్యతిరేకంగా గొప్ప సామాజిక ఉద్యమాన్ని నిర్మించారు. 
వెనుకబడిన కులాల వారికోసం ప్రత్యేకంగా దేవాలయాలను నిర్మించారు. అందులో వెనుకబడిన తరగతుల వారినే పూజారులుగా నియమించారు. 
ఆయన నిర్మించిన దేవాలయాలు అవర్ణులలో గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మాభిమానాన్ని, ఉత్తేజాన్ని కలిగించాయి. ఆ దేవాలయాలను శ్రీ నారాయణగురు విద్యాలయాలుగా కూడా ఉపయోగిస్తూ వెనుకబడిన తరగతుల వారిలో విద్యావ్యాప్తికి విశేషంగా కృషి చేశారు. 
వివాహాలు, బారసాలలు, చావులు వంటి సందర్భాలలో ఆచారాల పేరిట శక్తికి మించి చేసే ఖర్చులను ఆయన పూర్తిగా రూపుమాపారు. చావులకి, పెళ్లిల్లకి బ్రాహ్మణుల మీద ఆధారపడకుండా, వారు తమను దోపిడీ చేసే అవకాశం లేకుండా చేశారు. ఈ అర్థంలేని ఆచారాల వల్ల అనేక కుటుంబాలు తమ తాహతుకు మించి ఖర్చుచేసి అప్పులపాలవుతుండేవి. ఆయన పుణ్యమాని అవర్ణ సమాజంలో అట్లాంటి వన్నీ మటుమాయమైపోయాయి. ప్రతి ఒక్కరూ విద్య ప్రాధాన్యతను గుర్తించడం ప్రారంభించారు. అంతకుపూర్వం అంటరానివాళ్లకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశార్హత వుండేది కాదు. శ్రీ నారాయణ గురు నిర్మించిన దేవాలయాలే విద్యాలయాలుగా సేవలు అందిస్తుండటంతో వారికి విద్య అందుబాటులోకి వచ్చింది. ఆతరువాత అనేక పాఠశాలలు నెలకొల్పడమే కాక ప్రభుత్వ పాఠశాలల్లో సైతం అంటరానివాళ్లని చేర్చుకోవాలని పోరాడి సాధించారు. దాంతో ఒక్కసారిగా వెనుకబడిన తరగతుల వారి స్థితిగతుల్లో గొప్ప మార్పు చోటుచేసుకుంది. 

సంఘ సంస్కరణకోసం విలక్షణమైన తాత్విక మార్గాన్ని అనుసరించిన శ్రీ నారాయణగురు ప్రభోదాలు అవర్ణులందరికీ శిరోధార్యాలయ్యాయి:
''మనుషులందరికీ ఒకే కులం ... ఒకే మతం ... ఒకే దేవుడు.''
''మతం కోసం మనిషి కాదు. మనిషి కోసం మతం.''
''కులం అడగొద్దు ... కులం చెప్పొద్దు ... కులం గురించి అసలు మాట్లాడనే వద్దు.'' 
''విద్య ద్వారా స్వేచ్ఛ ...సంఘటితమవడం ద్వారా శక్తి ...పరిశ్రమించడం ద్వారా ప్రగతి !'' 
''మతం ఏదైనా గానీ మనిషిని ఎదగనివ్వాలి.''

అంటూ శ్రీ నారాయణ గురు చేసిన ప్రభోదాలు కేరళలోని వెనుకబడిన, దళిత సమాజంలో విప్లవాత్మక మైన మార్పులకు నాంది పలికాయి.

The Chamcha Age Video

Poona Pact