Sunday, May 24, 2020

Jathaka తపఃఫలం

#తపఃఫలం*

*బుద్ధుని దగ్గరకు వచ్చిన ఒక యోగి.. ''భగవాన్! నేను ఆరు నెలలు తపస్సు చేసి నీటిలో మునిగిపోకుండా ఉండే శక్తులు సంపాదించాను అన్నాడు. ''అలాగా! ఏదీ నీ శక్తులు చూపించు'' అన్నాడు బుద్ధుడు. ఆ యోగి ఆ పక్కనే ఉన్న నది నీటి మీద నడుస్తూ ఈ దరి నుంచి ఆ దరికి వెళ్లి గర్వంగా నిలబడ్డాడు.*
 
*"మళ్లీ వెళ్లిరా!" అన్నాడు బుద్ధుడు. భగవాన్ ! మళ్లీ రావాలంటే మరో ఆరు నెలలు తపస్సు చేయాలి అన్నాడు. చూశావా! ఎంత అజ్ఞానంలో ఉన్నావో! ఒక్క రూక ఇస్తే పడవ మీద వెళ్లి రాగలిగిన పనికి ఆర్నెల్లు వృథా చేస్తున్నావు. అయినా మనం మునిగి పోకుండా ఉండాల్సింది నీటిలో కాదు.*
 
*కామం, క్రోధం, ధన వ్యామోహం, లోభం, మద మాత్సర్యాలు, అహంకారం, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు అనే అమానవీయ విషయాల్లో మునిగిపోకూడదు. వాటిలో మునక్కుండా ఉండేందుకు మన శక్తియుక్తుల్ని వినియోగించాలి. అదే సరైన యోగం, ధ్యానం అన్నాడు బుద్ధుడు. ఆ యోగికి జ్ఞానోదయమై బుద్ధుణ్ని అనుసరించాడు.*

No comments:

Post a Comment

The Chamcha Age Video

Poona Pact