Friday, July 15, 2022

A. భారతీయ సామాజిక వ్యవస్థ - దానిని నిలబెట్టే శక్తులు – పరిష్కార మార్గాలు

CLASS 1 : భారతీయ సామాజిక వ్యవస్థ - దానిని నిలబెట్టే శక్తులు – పరిష్కార మార్గాలు
మొదటి class లో నేర్చుకున్న కొన్ని అంశాలు క్లుప్తంగా ఇక్కడ చూద్దాం...
ఈ దేశంలో నిచ్చెన మెట్ల కులవ్యవస్థ ఏవిధంగా వుందో మనకందరికీ ఒక ప్రాథమిక అవగాహన వుంది. అయితే ఈ అవగాహన మనలను ఈ వ్యవస్థను కూల్చడానికి పురికొల్పే విధంగా లేకుండా ఈ వ్యవస్థ తో సర్దుబాటు దిశగా పయనించే విధంగా వుంది...
ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ యొక్క సూత్రం “Salute the Above and Kick The Below”

ప్రత్యక్షంగా అసమానత్వాన్ని తీసుకుని వస్తే ఎవరూ దాన్ని అంగీకరించరు, కనుక అసమానత్వం అనేది పరోక్షంగా ఒక అబద్ధం చుట్టూ మొదలవుతుంది. 

ఆ అబద్ధం చుట్టూ ఒక కథ అల్లి దానిని మళ్ళీ మళ్ళీ చెబుతూ ఒక బుర్ర కథ లా ప్రచారం చేసి ప్రజల్లో మెదడు లోకి ఎక్కించడం ద్వారా కొన్నాళ్ళకి అది నిజంగా మారుతుంది. 

ఆ నిజంగా మారిన అబద్ధాన్ని కొంతమంది పాటిస్తే అది కట్టుబాటు అవుతుంది.
దీని వలన సామాన్య ప్రజలను తేలికగా దోచుకోవచ్చ అని అనుకున్నప్పుడు, దానికి చట్టబద్ధత కల్పిస్తే అది శాసనం అవుతుంది. 

ఈ శాసనం తరువాతి తరాలకు కూడా‌ ప్రాకితే అది సాంప్రదాయం అవుతుంది. ఒక వేళ ప్రజాస్వామ్యాన్ని సమానత్వాన్ని గౌరవించే రాజు వస్తే ఆ సాంప్రదాయం కాస్త మంటలో కలిసి పోతుంది.

కనుక మంటల్లో తగలపడకుండా  కాపాడుకోవటానికి, ఆ సాంప్రదాయానికి పవిత్రత చేకూర్చి ధర్మాన్ని 
(మతాన్ని) సృష్టించడం జరుగుతుంది. ఆ మతానికి పునాదులుగా అసమానత్వం అనే శాసనాలను, సిద్ధాంతాలు గా చేయడం వలన మన (బహుజనుల) అభివృద్ధి ఆగిపోయి ఎక్కడ వేసిన గొంగళి లా అక్కడే  ఆగిపోతుంది.
(ఇక్కడ అసమానతలను పెంచి పోషించే ధర్మం-మతం గురించి మాట్లాడుతున్నాము...)
ఈ యొక్క అసమానత్వం అనే సిద్ధాంతం పునాదిగా ఏర్పడిన వ్యవస్థ గురించి తెలుసుకునే ముందు ఈ యొక్క సిద్ధాంతం వలన కష్టాల్లో పడింది ఎవరు??
ఈ యొక్క సిద్ధాంతం వల్ల లాభం  ఎవరికి??
ఈ యొక్క సిద్ధాంతం సృష్టికర్త ఎవరు??
ఈ విషయాలు ముందు తెలుసుకుందాం.

మనం క్లాసు లో చెప్పుకున్నట్టు కష్టాల్లో ఉన్న వారి సంఖ్య సుమారు 85 శాతం ఉండొచ్చు, వారి గుర్తింపు ఏమిటి? కనుక కష్టాల్లో లేని వారు అంటే  సుఖాల్లో (15%) ఉంటున్న వారి గుర్తింపు ఏమిటి?
ఎప్పుడూ కష్టాల్లో ఉన్నారు అంటే బానిసలు అని అర్థం. బానిసలకు వేరే పదం శూద్రులు అని కూడా ఉంది. అప్పట్లో శూద్రులు ఇప్పుడు SC, ST, OBC, MINORITIES గా పిలవబడుతున్నారు.
శూద్రులు కాకుండా మిగిలిన వారు ఎవరు??
బ్రాహ్మణులు 
క్షత్రియులు 
వైశ్యులు. 
బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర.  ఈ నాలుగింటిని కలిపి చాతుర్వర్ణ వ్యవస్థ అంటారు.
ఇందులో శూద్రులు బానిస ఐతే మిగిలిన వారు అగ్రవర్ణాల వారు అవుతారు.
కనుక ఈ అగ్రవర్ణాల లో ఒకరు శూద్రుల బానిసత్వానికి కారకులవుతారు.
ఈ అగ్రవర్ణాలలో అందరికన్నా పైన ఉన్న వారు ఎవరు?



_బ్రాహ్మణులు._ 
ఈ బ్రాహ్మణులను అందరి నెత్తి మీద పెట్టిన సిద్దాంతం ఏమిటి?
మనువాదం
మనువాదానికి మూలం మనుస్మృతి .

మనువాదానికి మూలమైన మనుస్మృతి బ్రాహ్మణులు బ్రహ్మ ముఖం నుంచి పుట్టాడు కనుక బ్రాహ్మణులు పుట్టుకతోనే ఉత్తములు.
పైన పోస్ట్ లు మీరు గమనించినట్లయితే బొడ్డు కింద భాగం, అపరిశుభ్రం, బొడ్డు పై భాగం పరిశుభ్రం అని అందుకు బ్రాహ్మణులు మరియు క్షత్రియులు ఉత్తములు అని చెప్పారు.
బ్రహ్మ తొడల నుంచి వైశ్యులు పాదాలనుంచి శూద్రులు పుట్టారు.
కనుక బ్రాహ్మణులు క్షత్రియులు కంటే వైశ్యులు శూద్రులు అల్ప జాతులు అని అర్థమవుతుంది వీరిద్దరిలో శూద్రులు, వైశ్యులు కన్నా  కింది వారు.
కనుక అందరికి బానిసలు శూద్రులు అని చెప్పడం జరిగింది...

మీరు గమనించినట్లయితే బ్రాహ్మణ ధర్మం ప్రకారం స్త్రీకి స్వేచ్ఛ అనేది లేదు. 

ఇక్కడ కేవలం శూద్ర స్త్రీ అని చెప్పలేదు, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వెశ్యుడు, శూద్రుడు అని పురుష లింగం మాత్రమే ప్రస్తావించారు కాని, ఎక్కడా బ్రాహ్మణురాలు, క్షత్రియురాలు, వైశ్యురాలు అని స్త్రీ లింగం తో పిలవలేదు, అంటే దీని అర్థం స్త్రీ ఎవరైనా బానిసే అని.

అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అందరి స్త్రీ లు బానిసలే. అని మనుధర్మ శాస్త్రాం చెబుతుంది. 
బాల్యంలో తండ్రి చెప్పుచేతల్లో యవ్వనంలో భర్త అధీనంలో పెద్దయిన తర్వాత తన బిడ్డల యొక్క మాటలు వింటూ జీవితం గడపాలని బ్రాహ్మణ మనుధర్మం చెబుతుంది.
ఎటువంటి స్వతంత్రం లేకుండా జీవితాంతం బానిసగా గడపాలని బ్రాహ్మణులు మనుస్మృతి చెబుతుంది.

స్రీలపై జరుగుతున్న అత్యాచారాలు :
‘బేటీ పడావో బేటీ బచావో’ అని నినదించే రాజ్యం స్కూలుకి వెళ్లటానికి కనీసం బస్సు కూడా ఏర్పాటు చేయకపోతే నాలుగైదు మైళ్లు డొంకదారుల్లో నడిచిపోయే హాజీపూర్ పిల్లలు కావచ్చు, అమ్మ పక్కన ఆదమరిచి నిద్రపోయే నెలలపాప కావచ్చు, ఇంతమంది తిరిగే చోట భద్రమే అనుకుని స్కూటర్ పార్కు చేసుకున్న దిశ కావచ్చు, స్నేహితుడే కదా అని నమ్మిన మానస కావచ్చు, రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఇల్లు చేరుకునే తొందరలో ఉన్న టేకు లక్ష్మి కావచ్చు, హాస్టల్ లో ప్రశాంతంగా ఉన్నాననుకున్న ఆయేషా మీరా కావచ్చు, సినిమా తార అయి కూడ (బహుశా అయినందువల్లనే) రక్షణ లేని ప్రత్యూష కావచ్చు, మనకు తెలియని మరెవరో కావచ్చు. నేర స్వభావం అనేది పేద ధనిక భేధం లేకుండా పెరుగుతూ ఉందన్నది ఒక వాస్తవం. కాని నేరస్తులు పేద వారో లేదా భాదితులు మధ్యతరగతి లేదా ఆ పైవర్గం వాళ్లో అయినప్పుడు మాత్రమే అవి వార్తలు కావడం, లేదా అందులో నేరస్తులకి శిక్షలు పడటం ఈ దేశపు వాస్తవం. నేరస్తులు పైవర్గం వాళ్లయితే, వాళ్లకు రాజకీయ అండదండలు ఉంటే వాస్తవాలు బయటికి రావు.
బ్రాహ్మణీయ నిచ్చన మెట్ల కులవ్యవస్థ దుష్ఫలితాలే ఇలాంటి అత్యాచారాలు. POLITICAL POWER లేకపోవడమే ఈ సంఘటనలన్నింటికి కారణం...


No comments:

Post a Comment

The Chamcha Age Video

Poona Pact