Friday, July 15, 2022

D. ఛత్రపతి సాహు మహారాజ్


ఛత్రపతి సాహు మహారాజ్:

1874 జూన్ 26న రాధాబాయి, జయసింగ్ ఆబాసాహేబ్ ఘాట్గేలకు జన్మించిన యశ్వంతరావు ఘాట్గేనే ఆ తర్వాత కాలంలో "సాహుమహారాజ్" గా  ప్రసిద్ది చెందుతాడు . ఘాట్గేలు మహారాష్ట్ర లో వెనుకబడిన తరగతులకి ( ఓబీసీ ) చెందిన   వ్యవసాయం చేసుకుని జీవించే కున్భీ కాపు కులం. ఛత్రపతి శివాజీ స్థాపించిన మరాఠ సామ్రాజ్యంలోని కొల్హాపూర్ రాజ్యంలో వారసులు లేకుంటే నాల్గవ శివాజీ భార్య రాణీ ఆనందబాయి 1884 మార్చి , 17 న  తన బంధువుల అబ్బాయిని దత్తపుత్రుడిగా స్వీకరించి  యశ్వంత్ రావు ఘాట్గే కి ముద్దుగా  ' సాహు ' అని  పేరు పెట్టుకుంటది. మూడేళ్ళకే తల్లిని కోల్పోయిన సాహు , 1886 మార్చి 20 న తండ్రి మరణంతో 11 ఏళ్ళకే తల్లిదండ్రులిద్దరులేని వాడైనాడు .సాహు చిన్నతనమంతా ఆంగ్లేయ అధ్యాపకుల పర్యవేక్షణ లో జరిగినందున ఆధునిక భావాలు పుణికి పుచ్చుకున్నాడు . యుక్తవయసు రాగానే 1894 ఎప్రిల్ 2 న సింహాసనం అధిష్టిస్తాడు సాహు .
 
1630 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని కున్భీ కాపు వ్యవసాయ శూద్ర కులం (బీసీ )  లో  పుట్టిన శివాజీ ఏ సింహాసన వారసత్వం లేకుండా స్వశక్తితో ఒక రాజ్యాన్ని స్థాపించిన శివాజీ జీవితం ప్రజాస్వామ్య దేశంలో బానిస బ్రతుకు బ్రతుకుతున్న శూద్రులకు వీపు మీద ఒక  చరుపులాంటిది. రాజ్యం కాదు ప్రజలు తమదిగా భావించే స్వరాజ్యంలో  రైతులు ,  స్త్రీలు , అస్పృశ్యులు , ఆదివాసూలు ,  సామాన్యులను ఎలా భాగస్వామ్యం చేయాలో రాజ్య నిర్మాణం ఎలా ఉండాలో అనే ప్రణాళిక కి ఆయన పాలన విధానం మాతృక లాంటిది......
      జాతీయ భావన లేని , దేశ ప్రేమ లేని ఆధిపత్య గుంపు తమ స్వార్థం కోసం శారీరక శ్రమ తెలియని గుంపు ఎవరు కొత్త రాజుగా వచ్చినా పరుగెత్తి వెళ్ళి పాదాల చెంత  మోకరిల్లి విధేయతను ప్రకటించుకుంటూ కులకర్ణిలుగా ( పట్వారీ )  పటేoడ్లుగా , దేశముఖ్ లు దేశపాండేలు జాగీర్‌దారులుగా తమ పీఠాలకు డోకా లేదనే హామి తీసుకొని అడుగులకు మడుగులొత్తుతూ పాదాలను తమ చేతుల్లోకి తీసుకొని తమకు నచ్చిన రీతిలో పాలన సాగిస్తూ ప్రజలను రైతులను వేధిoచుక చంపుతూ ఖజానా నింపుతుంటే రాజ్యమంటే దోపిడి అని రాజు అంటే క్రూరుడని ప్రజలు భావిస్తున్న కాలంలో.., రైతులకు భూములని కొలిపించి న్యాయమైన పన్ను నిర్ణయం చేసి కరువు సమయంలో పన్ను మినహాయింపునివ్వడమే గాకుండా అదనపు సాయాన్ని అందించి దేశముఖ్ దేశపాండేలు తన రాజ్యంలో గతంలోలాగా అరాచకాలకు పాల్పడితే సహించేది లేదనీ వాళ్ళు కూడా ఏ హంగు, ఆర్భాటాలు లేకుండా రైతుల వలే సాదారణ ఇండ్లల్లో నివాసం ఉండాలనీ హుకుం ఈ దేశ సామాన్య ప్రజలకు ఈ దేశం మీద ప్రేమ కల్పించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ . 
         శివాజీ దళితులని దుర్గాధిపతులని చేసిండు. శివాజీ గూఢాచారి విభాగం (ఇంటెలిజెన్స్ ) అధిపతి బాహిర్జీ నాయక్ ఆదివాసీ  రామోషి తెగ వ్యక్తి.  నౌకాదళంలో సముద్రంలో  చేపలు పట్టే కోలీ , సొంకాలీ , భండారీ లాంటి మట్టి మనుషులని సైన్యంగా మార్చిండు. ఆయన రాజ్యంలోని కొంతమంది మంత్రుల గురించి,

1)విదేశీ వ్యవహారాల మంత్రి ముల్లా హైదర్
2)ముఖ్యమైన ఆయుదగరా మంత్రి ఇబ్రహీం ఖాన్
3)నౌకదాలపతే దౌలత్ ఖాన్
4)శివాజీ అంగరక్షకుడు మదాని మెహతర్ శివాజిని హౌరంగజేబు ఆగ్రాలో భందించినప్పుడు తన ప్రాణాలకు తెగించి కాపాడాడు. ఈ బ్రాహ్మణులు ఎవ్వరు రాజులు అయిన సహిస్తారు... సుల్తానులు ,మొగలులు లాంటి వారిని సమర్దిస్తారు.కానీ,శూద్రులు రాజులు అయితే తట్టుకోలేరు.ఆయన మీద ఎన్నో కుట్రలు చేశారు.ఆయన నిజంగా హిందువు అయితే ఆయన రాజ్యంలోని మంత్రులు అందరూ ముస్లింలు ఎందుకు ఉన్నారు.ఆయన భవనం ముందు దర్గా ఎందుకుకట్టించాడు?ఉర్దూ నిఘంటువుని ఎందుకు అభివృద్ధి చేసిండు?ఒకసారి ఆలోచించండి.కొంతమంది స్వార్థం కోసం ఏమైనా చెప్తారూ కానీ మనం నిజం తెలుసుకొవాలి. శివాజీకి దుర్గ మాత కత్తిని బహుకరించింది అంటారు ఆ కత్తి ఇప్పటికి మ్యూజియం లో ఉంది దాని మీద పోర్చుగిసు భాషలో ఏవేవో అక్షరాలు ఉన్నాయి. బహుజనులు ఇప్పటికైనా మేలుకొని నిజం తెలుసుకోండి.
అది జాతీయ సైన్యం . అది దేశమంటే తమ రాజ్యమంటే ప్రేమ గల నిజమైన సైన్యం. అందుకే అపుడు ప్రజలు ఈ దేశం మాది రాజు మా నాయకుడు అని భావించారు. 

     అలా విదేశీ ముస్లీంల దండయాత్రతో భారత దేశం విదేశీయుల పాలైన సంధర్భంలో ఈ దేశంలో తిరిగి స్వరాజ్యాన్ని స్థాపించింది ఇక్కడి మూలనివాసులే..... 
      ఆ మూలనివాసీల శూద్రుల నాయకుడు శివాజీ మహారాజ్ ....
     
బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి. 
క్షత్రియులు మాత్రమే యుద్దాలు చేయాలి , రాజ్యమేలాలి , 
వైశ్యులు మాత్రమే వ్యాపారం చేయాలి. 
     
శూద్రులు పై మూడు వర్గాలకి సేవ చేయాలన్న సంధర్భంలో ..., 
నాలుగు శాతం ఉన్న క్షత్రియులు మాత్రమే యుద్ధం చేస్తే ఈ దేశాన్ని కాపాడుకోలేమని గ్రహించిన వ్యవసాయ కులానికి చెందిన మరో కున్భీకాపు సంత్ తుకారాం ( భక్త తుకారాం )  గురువుగా  ఛత్రపతి శివాజీకి హితబోధ చేస్తాడు. 
ఆ మేరకు శివాజీ రాజ్యంలో జూన్ నుండి అక్టోబర్ నాటికి పంట చేతికి వచ్చినంక  రైతులందరు దసరాకి (బలి చక్రవర్తి గుర్తుగా )  సైనిక శిక్షణ తీసుకోని సంక్రాంతి నుండి ( పంట ఇంటికి చేరినంక )  యుద్ధాలలో పాల్గొని శివాజి సామ్రాజ్యాన్ని విస్తరింపచేస్తరు . 

ఈ దేశంలో తిరిగి రైతులచే ,సామాన్యులు , మహిళలచే స్వరాజ్యం స్థాపించబడిoది. శివాజీ సైన్యంలో పెద్ద ఎత్తున రైతులతో పాటు మిగతా శూద్రులు , అతిశూద్రులు ( దళితులు ) , ఆదివాసీ రామోషి లాంటి తెగలు , ముస్లీంలు (మతం మారిన ఈ దేశ మూలనివాసీలు) పనిచేసిండ్రు.

ఆంగ్లేయులు మన దేశాన్ని వదిలి పోయి డెబ్బై సంవత్సరాలు అవుతున్నా పరిపాలనా / అధికార భాషగా ఆంగ్లమును కొనసాగిస్తూ సాదారణ గ్రామీణ ప్రజలనుండి గ్రాడ్యేట్ వరకు బ్యాoక్ లో ఖాతా ఎలా ఓపెన్ చేయాలో తెలియని ప్రస్తుత పరిస్ధితిని పోల్చుకుంటే ఛత్రపతి శివాజీ తన కాలంలో పరిపాలన భాష అయినా పర్షియన్ ని తొలగించి ప్రజల భాష మరాఠీ నే పరిపాలన భాషగా చేసిండు.....

స్వదేశీ వాణిజ్యం , పరిశ్రమలు కాపాడేందుకు విదేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల మీద ఆ రోజుల్లోనే భారీ సుoకాలు విధించిండు. భారతదేశంలో స్త్రీ పురుషులని సంతలల్లో అమ్మడం కొనడం చేసే రోజుల్లో బానిస వ్యాపారాన్ని నిషేధించిండు. 

స్త్రీల విషయంలో శివాజీ చాలా ఉన్నతమైన వైఖరి కలిగి ఉన్న వ్యక్తి. 1678 లో సైన్యాధిపతి శకూజీ గైక్వాడ్ చేలాది దుర్గం ముట్టడి0చి సావిత్రిబాయి దేశాయ్ అనే ఆ దుర్గాధిపతిని మానభంగం చేస్తే శివాజీ కళ్ళు పీకించి యావజ్జీవ కారాగారవాసం విధించిండు. 

కళ్యాణ్ సుబేదార్ ని ఓడించాక ఆమె కోడలిని ఒక యోధుడు శివాజీకి కానుకగా సమర్పిస్తే  ఆమెని చూసి శివాజీ 'మా అమ్మ ఇంత అందంగా ఉంటే నేనెంత అందంగా ఉండేవాడినేమో ! ' అని ఆమెని  తిరిగి సగౌరవంగా వెనక్కి పంపిస్తాడు. 

రాంజ గ్రామ అధికారి పాటిల్‌ ఓ పేద రైతు కూతురిని మానభంగం చేస్తే ఆత్మహత్య చేసుకుంటది. అది తెలిసిన శివాజీ పాటిల్‌ కాళ్ళు చేతులు ఖండించే తీవ్రమైన శిక్ష ని విధించి వెంటనే అమలు చేస్తాడు. శివాజీ తీర్పు విన్నoక రంగే పాటిల్ అక్కడ ఉన్న దాదాజి కొండదేవ్ తో ' అర్హత ఉన్న వాళ్ళే తీర్పు చెప్పాలీ ' ఆ అధికారం బ్రాహ్మణుడికి ఉంటుంది లేదా రాజుకి ఉంటుoది అని శివాజీ యొక్క కులాన్ని ప్రశ్నిస్తాడు.....
            అలాంటి ఒక సువిశాల మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన శివాజీకి పట్టాభిషేకం చెయ్యడానికి
ఏ బ్రాహ్మణుడు ముందర రాలేదు 
కారణం శివాజీ శుద్రుడు కాబట్టి.....

      హిందు ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణులకి క్షత్రియులకి మాత్రమే  రాజయ్యే హక్కు ఉంది. దాంతో శివాజీ పట్టాభిషేక కార్యక్రమానికి కాశీ నుండి అప్పుడు గంగాభట్ అనే బ్రహ్మాణున్ని అతని బరువుకు సరితూగే బంగారం ఇస్తానని ఒప్పించి రాజ్యాభిషెకం చెయ్యడానికి పిలిపిస్తే కాలిబ్రొటన వేలు తో గగాభటుడు శివాజీ నుదిటకి తిలకం దిద్ది  రాజ్యాభిషేకం చేస్తాడు .వ్యక్తిగతంగా శివాజీకి బ్రాహ్మణులు అందరు వ్యతిరేకం కాకపోవచ్చు. కానీ బ్రాహ్మణ ధర్మం కులం పేరిట ఒక మహా చక్రవర్తిని అవమానించింది. శూద్రులు రాజులు కాకూడదని ధర్మం విధించింది. ముసల్మాన్ రాజు కావచ్చు కానీ సూద్రుడు కాలేడు. 

మహా చక్రవర్తి ఐన శివాజీని జీవితాంతం వెంటాడిన బ్రాహ్మణవాదం ఆ తర్వాత తన పబ్బం గడుపుకొనుటకు శివాజీని ముస్లిం వ్యతిరేకిగా కరుడుగట్టిన హిందూ మతాభిమానిగా చిత్రించి చరిత్రని వక్రీకరించింది. భవానీ మాత ఖడ్గం ప్రసాదించినట్లు మూఢవిశ్వాసాన్ని  ప్రచారం చేసారు.నిజానికి అది అపుడు పోర్చుగల్ లో తయారు  చేయించిన కత్తి. శివాజీ వాడిన ఆ ఖడ్గం ప్రస్తుతం సతారా మ్యూజియం లో ఉంది. దానిపై పోర్చుగీస్ లిపి ఉంది. ఛత్రపతి  బ్రాహ్మణమతానికి లోబడి పని చేసిండు. అవలంభిoచిండు. కానీ మత దురాభిమాని కాదు. అప్పటి మొఘల్ చక్రవర్తికి వ్యతిరేకంగా స్వరాజ్య స్థాపన కోసం పని చేసిండే తప్ప ముస్లిములకు వ్యతిరేకంగా కాదు. శివాజీని ముస్లిం మత వ్యతిరేకిగా ప్రచారం చేసి తప్పుడు జాతీయ వాదానికి ప్రతీకగా నిలబెట్టారు. . .


చక్రవర్తి శివాజీ ని ఈ రోజు బ్రహ్మానీకరణం చేసీ మనల్ని మోసం చేస్తుంటే దాన్ని తెల్సుకోకుండా మతం మత్తులో అగ్రవర్ణ ఆధిపత్య బ్రాహ్మణీయ  మాయాజాలంలో నిండా మునిగి తెలవిలేక పావులా బీసీలు  మారడం విచారకరం.

1874 ఫిబ్రవరి 12 న మహాత్మ జ్యోతి బాపూలే రాయగడ్ లోని శివాజీ సమాధిని వెలికితీసి శివాజీ చరిత్రని గేయ రూపంలో రాసి 1885 నుండి శివాజీ జయంతి ఉత్సవాలను ప్రారంభించిండు.

సాహూ మహారాజ్ గురించి కొంత సమాచారం:
సాహూ మహారాజ్ దృక్పదాన్ని మార్చిన సంఘటనలు:

i) 1900 వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఒక రోజు సాహు మహారాజ్ పంచగంగా నదిలో స్నానం చేస్తున్న సమయంలో బ్రాహ్మణ పురోహితుడు స్నానం  చేయకుండానే వచ్చి సాహు మహారాజ్ క్షత్రియ వంశస్తుడు కానందున ఒక వ్యవసాయం  చేసుకునే కులానికి చెందిన శూద్రుడైనందున ఈశడిoపుతో వేదోక్త మంత్రాల బదులు పౌరాణిక  మంత్రాలు చదివి అవమానిస్తాడు . పుట్టుకతోనే మనిషి కులం నిర్ణయించబడుతుందనీ రాజైనంత మాత్రాన , దత్తత వచ్చినంత మాత్రాన క్షత్రియుడిగా మారిపోడని వాదనకు దిగుతాడు.

          ఈ సంఘటన సాహు మహారాజ్ ని మహాత్మ జ్యోతిబాపూలే సత్యశోధక సమాజ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే వారసత్వాన్ని ఎన్నుకోవడానికి కారణమైతది.బాస్కరరావు జాదవ్ అనే ఉద్యోగిని ' సత్యశోధక్ సమాజ్ ' నడిపే బాధ్యతలు అప్పచెప్పి ' మరాఠ దీనబందు ' పేరుతో పత్రికని నడిపించి సత్యశోధక సమాజ తాత్విక దృక్పథాన్ని ప్రచారం చేయించిండు . బ్రాహ్మణేతరులకి పురోహిత శిక్షణనిచ్చేందుకు సత్యశోధక్ సమాజ్ ఆధ్వర్యంలో పాఠశాల ప్రారంభమైంది. కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో వందలాది వివాహాలు , వేడుకలు సత్యశోధక్ సమాజ్ పద్దతిలో జరిగాయి.

ii) తను సింహాసనం అధిష్టించే నాటికి తన రాజ్యంలో మత కర్మలలో మొదలు పరిపాలనలోని అన్ని ఉద్యోగ  రంగాలతో పాటు వ్యాపారం , వడ్డీ వ్యాపారం లో కూడా బ్రాహ్మణులే నిండిపోవడం సాహు గమనించిండు . బ్రాహ్మణేతరులని ఉన్నతోద్యాగాల్లోకి తెస్తే తప్ప వారి సామాజిక హోదాలో , జీవితాల్లో మార్పు రాదని , బ్రాహ్మణ ఆధిపత్యానికి అడ్డుకట్టపడదని  సాహు భావించిండు . తన ప్రైవేట్ సెక్రెటరీ ఉద్యోగానికి అండర్ గ్రాడ్యేట్  ( డిగ్రీ స్థాయి లేని ) అయిన ఒక జైనుడిని ఎన్నిక చేసుకుంటే బ్రాహ్మణ సమాజం ఏకమై పెద్ద ఎత్తున నిరసన తెలియచేసింది. ఐతే ఆ రాజ్యంలో అప్పటికి గ్రాడ్యేషన్ పూర్తి చేసిన బ్రాహ్మణేతరుడు ఒక్కరు లేరు.

          సమస్యను గుర్తించిన సాహు వెనుకబడిన కులాల వారందరికి స్కూల్స్ , హాస్టల్స్  ప్రారంభించి విద్యని ఒక ఉద్యమంగా నడిపిండు . కొల్హాపూర్ పట్టణంలో హాస్టల్స్ కాలనీనే నిర్మించిండు . ప్రపంచ చరిత్రలో ఇదొక అరుదైన విషయం. 1901 లో జైన హాస్టల్ , విక్టోరియ మరాఠ హాస్టల్ , 1906 లో ముస్లీంలకు , 1907 లో వీరశైవ లింగాయత్ లకు , 1908 లో అంటరానివారికి , మరాఠాలకీ 1921లో దర్జీ మరియు నేత కులస్తులకి  నామ్ దేవ్ హాస్టల్‌ , విశ్వకర్మలకి సోనార్ హాస్టల్స్ నిర్మించిండు .ప్రతి గ్రామంలో కనీసం ఒక ప్రాథమిక పాఠశాలనేర్పరచి  అందరికి , అన్ని కులాల వారికి ఉచిత నిర్భంధ ప్రాథమిక విద్యనందించిండు . పాఠశాలలకు స్వంత భవనాలు ఏర్పడే వరకు  గ్రామాల్లోని అన్ని ఆలయాలను , చావడీలను పాఠశాలలుగా వాడాలనీ , ఏ గ్రామంలో ఏ కులస్తులు మెజారిటీ గా ఉన్నారో చూసి ఆ కులపు వ్యక్తినే ఉపాధ్యాయుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది. ముస్లీంలకు వాళ్ళ మాతృ భాషలోనే పాఠశాలలు ప్రారంభమైనాయి . ఆ తర్వాత కాలంలో కొంత మార్పు రాగానే  కులపరమైన విద్యాసంస్థలని రద్దు చేస్తూ  అన్ని కులాల  , మతాల వారు కలిసిమెలిసి ఏ పాఠశాలలోనెైన , విద్యా సంస్థలో నైనా చదువొచ్చని ప్రకటన ఇచ్చింది సాహు ప్రభుత్వం .వ్యవసాయం ఇతర వృత్తులు చేసే వయోజనుల కోసం రాత్రి పాఠశాలలు ఏర్పడ్డాయి.
iii) ఒక ఉద్యమాన్ని నడిపించే నాయకుడు కేవలం ఉపన్యాసాలిస్తే సరిపోదని తను చెప్పిన  ఆచరించి చూపిండు సాహు మహారాజ్ . నిరక్షరాస్యుడైన గంగారామ్ కాంబ్లే అనే అంటరాని వక్తి ఆధారం చూపించమంటే సాహు డబ్బిచ్చి హోటల్ పెట్టిస్తే ఎవరు ఆ హోటల్ కి రాకుంటే సాహు స్వయంగా తన పరివారంతో వెళ్ళి ముందు తను  టీ తాగి తన వాళ్ళందరికి తాగిస్తాడు . పాలన నిర్వహణకి అవసరమైన విద్యార్హతలు లేని అంటరాని వారిని తన కుటుంబంలో వివిధ రకాల పనులకి తీసుకున్నాడు . రథచోదకులుగా , మావటీలుగా , రక్షకభటులుగా నియమించిండు . 1919 , సెప్టెంబర్ 6న అంటరానితనాన్ని పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. అంటరాని ఉద్యోగులతో ప్రజలు గానీ ,  ప్రభుత్వ కార్యాలయాల్లో ఇతర ఉద్యోగులు అగౌరవంగా ప్రవర్తిస్తే పిర్యాదు అందితే నేరస్తుల మీద చర్యలు తీసుకుంటారు. నేరస్తులు ఉద్యోగులైతే ఆరు వారాల్లోగా విచారణ జరిపి నేరస్తులని తేలితే ఉద్యోగం నుండి తొలగింపుతో పాటు పెన్షన్ కూడా రద్దైపోతుంది . 60 సంవత్సరాల భారత ప్రభుత్వం తెచ్చిన ఎస్.సి. / ఎస్.టీ. అట్రాసిటీ చట్టం కూడా ఇంత బలమైనది కాదు.

జులై 26 , 1902 భారత దేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం , ప్రభుత్వ పాలన వ్యవహారాల్లో '  ఎవరి జనాభా ఎంతో వారి వాటా అంత '  ఉండాలనే ఆలోచనతో  ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడినవర్గాల వారికి  50% రిజర్వేషన్ లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులని జారీ చేసింది . వెనుకబడిన వర్గాలు అనగా బ్రాహ్మణ , ప్రభు , షెన్వీ , పార్శీ మరియు ఇతర అభివృద్ది చెందిన కులాలు మినహా మిగిలిన అన్ని కులాల వారు . ( Backward classes shall be understood to mean all castes other than brahmin , Prabhus, Shenvis , Parsees and other advanced classes .) అంటరానివారి నుండి అన్ని మతాలలో వెనుకబడినవారు కూడా రిజర్వేషన్ కిందికే వస్తారు.

బాలగంగాధర తిలక్  లాంటి బ్రాహ్మణ జాతీయోద్యమ నాయకులు సాహు మహారాజ్ నడిపిస్తున్న పూలే వారసత్వ ఉద్యమాన్ని , పరిపాలన లో చేస్తున్న మార్పులని చూసి ఓర్వలేక అనేక కుట్రలు చేస్తారు. దాడికి దిగుతారు.
సాహు చేపట్టిన చర్యలు:
1) గ్రామ పరిపాలన రంగంలో వంశపారంపర్యంగా వచ్చే  ముఖ్యులైన పటేల్ ( పాటిల్ ) , పట్వారీ ( కులకర్ణి ) వ్యవస్థని 1918 లో రద్దు చేసిండు .

2) 1920 మే , 3వ తేదిన వెట్టిచాకిరి వ్యవస్థ ని రద్దు చేస్తూ చట్టం చేసింది ప్రభుత్వం . ఆ తర్వాత 55 ఏండ్లకు స్వాతంత్రం వచ్చినంకా 1975 లో మాత్రమే భారత ప్రభుత్వం వెట్టిచాకిరి నిర్మూలన చట్టం చేసింది .

3) గ్రామీణ పరిపాలనలో కింది స్థాయి ముఖ్య ఉద్యోగాలైన ' తలాతీ ' ( సుంకరి,గ్రామ రెవెన్యూ సహాయకులు) లుగా అస్పృశ్యులే ఉంటారు కాబట్టి వాళ్ళందరికి ఉద్యోగ నిర్వహణకు అవసరమైన శిక్షణనిచ్చేందుకు ట్రేనింగ్ స్కూల్స్ ప్రారంభించిండు. 2010 వరకు ఆంధ్రప్రదేశ్ లో వీరికి శిక్షణ లేదు.

4) ఆదివాసీ తెగలకు , అంటరాని వారికి సంబంధించి బ్రిటీష్ ప్రభుత్వం పెట్టిన ' నేరస్థ కులాల చట్టాన్ని ' 1918 లో రద్దు చేసిoడ్రు. మహర్ , మాoగ్ , రామోషీ , బెరాద్ లాంటి నేరస్థ కులాలుగా పరిగణింపబడే కులాల ప్రజలు ప్రతి రోజు పోలీస్ స్టేషన్ లో హాజరై సంతకం చేసే అమానుషం ఈ చర్యతో రద్దైoది .
Babasaheb – Sahu Maharaj

 సాహు మహారాజ్ అంటరానివారికి ఆపద్భాంధవుడిగా మారిన విషయం తెలుసుకున్న బాబా సాహేబ్ అంబేడ్కర్ సాహు మహారాజ్ ల మద్య పరిచయం పెరిగి రాబోయే బ్రిటీష్ చట్టాలు మంచిచెడుల గురించి మాట్లాడుకునేవారు. అంబేడ్కర్ ఆస్పృశ్యుల హక్కుల సాధన కోసం ఒక పత్రిక పెట్టాలనుకుంటున్నాననీ , ఐతే ఆర్థిక ఇబ్బందులతో చేయలేకపోతున్నానడంతో ఆ పత్రిక కి ఆర్థిక వనరులు సమకూర్చే బాధ్యతను తీసుకొని మొదట 2500 రూపాయలు ఇవ్వడంతో ' మూక్ నాయక్ ' పత్రిక ప్రారంభమౌతది.1920 , ఎప్రిల్ 15 న నాసిక్ లో అంబేడ్కర్ మరియు మిత్రులు  అంటరానివారికోసం ఒక హాస్టల్ కట్టాలనుకుంటే ఆ కార్యక్రమ ప్రారంభోత్సవానికి హాజరై ఐదు వేల రూపాయలు ఇస్తాడు సాహు .  1920 లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకొనుటకై ఆర్థిక సహాయం చేస్తాడు సాహు మహారాజ్ . అంబేడ్కర్ విదేశాల్లో ఉన్నంత కాలం ' మూక్ నాయక్ ' పత్రిక నిర్వహణ కి ఆర్థిక సహాయం చేసిండు .రమాబాయి యోగక్షేమాలను విచారిస్తూ , ఆమెకు అవసరమైన ఆర్థిక సహాయం చేస్తూ బాధ్యత గల స్నేహితుడిగా వ్యవహరించిండు సాహు . 1922 ఫిబ్రవరి 16న డిల్లీలో జరిగిన అంటరాని కులాల జాతీయ మహాసభలో పాల్గొన్న సాహు ' ఈ సభలో ప్రసంగించే అర్హత నాకన్న మించి ఉన్న అంబేడ్కర్‌  ఇంగ్లాండ్ లో ఉన్నందున పాల్గొనలేకపోవడం మన దురదృష్టం. మీ జాతి గర్వించదగిన మహోన్నత నాయకుడు అంబేడ్కర్ ను మీరందరు ఆదర్శంగా స్వీకరించాలని , ఆయన స్థాయికి అందుకోవడానికి మీ అభివృద్ధికి కావలిసిన సేవలను అందించడానికి నన్ను అనుమతించమని ప్రార్థన ' అంటూ మాట్లాడిండు .


 Women empowerment – Sahu Maharaj:
 
పితృస్వామ్య , కుల , మత వ్యవస్థల వల్ల స్త్రీల మీద జరుగుతున్న అమానుషాలని గ్రహించిన సాహు మొదట తన భార్య లక్ష్మీబాయి కి యూరోపియన్ టీచర్ ల ద్వారా ఆధునిక విద్యను చెప్పించిండు . సంగీతంలో , చిత్రలేఖనంలో , ఎంబ్రాయిడరీ లో శిక్షణ ఇప్పించిండు .కొల్హాపూర్ సంస్థానంలో బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభం చేసిండు .ఉన్నత విద్యలోకి బాలికలను ప్రోత్సహించేందుకు ఉపకారవేతనాలు , ప్రోత్సాహక బహుమతులు ఏర్పాటు చేసిండ్రు. కొల్హాపూర్ రాజారాం కాలేజీ లో బాలికలకు ప్రత్యేక విభాగం ఏర్పరిచిండ్రు. వెనుకబడిన ఆడపిల్లలకు ఉచిత భోజన , వసతి సదుపాయాలు కల్పించిండ్రు. 1919 జూన్ లో బాల్య వివాహాల రద్దు చట్టం  వచ్చింది. 1919 జులై 12న కులాంతర , వర్ణాంతర వివాహాలను  చట్టబద్దం చేస్తూ చట్టం తెచ్చిన ' కొల్హాపూర్ స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ - 1918 '  ప్రకారం  ఎందరో యువతీ యువకులు తమకు నచ్చిన భాగస్వామ్యులని ఎన్నుకున్నారు. విడాకులు మంజూరు చేయడం లో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగష్ట్ 2 న విడాకుల చట్టం మరియు స్పెషల్ మ్యారేజీ ఆక్ట్ అప్పుడు దేశంలో సంచలనాలను సృష్టించాయి. 1920 జనవరి 17న జోగిని , దేవదాసీ వ్యస్థను రద్దు చేసిండు . ప్రభుత్వం దేవదాసీ ల పునరావాసానికి చర్యలు తీసుకుంది. 1919 జులైలో వ్యభిచార వృత్తిలో ఉన్న స్త్రీలకు పునరావాసాన్ని కల్పించాల్సిందిగా అధికారులను ఆదేశించిండు.కొల్హా పూర్  ప్రాంతంలోని కోర్టులన్నిoటిలో  సివిల్ , క్రిమినల్ కేసుల విచారణలో తీవ్ర జాప్యం జరుగుతుండేది. రోజుకి ఎన్ని కేసులు విచారణ జరుపుతామనే అంచన లేక పెద్ద సంఖ్యలో పిలవడము చాలా మంది కేసు బెంచ్ మీదికి రాకనే తిరిగి పోవడం పదే పదే జరుగడంతో చాలా మంది పేదలు ఇబ్బంది పడేవారు. ఈ సమస్యకి పరిష్కారంగాను 1919 అక్టోబర్ 17న చట్టం చేస్తూ రోజు కు కేవలం మూడు కేసులకి మించి విచారణకు స్వీకరించకూడదు.అక్కడ సరైన న్యాయం జరగలేదని ఏ పౌరుడైనా భావిస్తే నేరుగా మహారాజ్ ని కలవచ్చు.  సాహు 1920 లో రూపొందించిన హిందూ న్యాయశాస్త్రం లోని అనేక అంశాలను స్వాతంత్రానంతరం రూపొందిన ' హిందూ పర్సనల్ లా ' లో భాగంగా భారత పార్లమెంట్ ఆమోదించింది.

ఉన్నత విద్యావంతుడైన సాహు మహారాజ్ నిరంతరం ప్రజల మద్యే ఉంటూ సమస్యలు తెలుసుకుంటా  ప్రజల భాషలో మాట్లాడేవాడు . పరిపాలనలో ప్రజలకు అర్ధం కాని , ప్రజలకు ఇబ్బంది కల్గించే బ్రాహ్మణ గుమాస్తాల , పట్వారీలు వాడే మోడీ లిపిని పరిపాలన వ్యవహారాల్లో రద్దు చేస్తూ 1917 మార్చి లో నిర్ణయం తీసుకున్నాడు . తెలంగాణాలో నైజాం పాలన తర్వాత కూడా కొన్నాళ్ళు మోడి లిపి రెవెన్యూ రికార్డుల్లో వాడబడింది. కరువు వచ్చినపుడు రైతులకు అన్ని రకాల పన్నులను , రుణాలని మాఫీ చేసిండు . అప్పుల కింద రైతుల ఆస్తులని , పనిముట్లనీ , పశువులని బలవంతంగా జప్తు చేసే చర్యలను నిషేధిస్తూ 1894 లోనే చట్టం చేసిండు. 1918 లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలని ఏర్పాటు  చేసిండు . రాజ్యంలో ప్లేగు వ్యాధి వచ్చినపుడు టెలిఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని సమర్థవంతంగా పని చేయించిండు. రాధానగరి , పనాలా , కరవీర్ , శిరోల్ వంటి ప్రాజెక్ట్ లని నిర్మించిండు . ' కింగ్ ఎడ్వర్ట్ అగ్రికల్చరల్ ఇన్సిట్యూట్ ' ద్వారా రైతులకు శిక్షణ తరగతులు ఏర్పాటు చేసిండు. తన తండ్రి పేరుతో ఏర్పరచిన ' జైసింగ్ రావు ఘాట్గే టెక్నికల్ ఇన్సిట్యూట్ '  ద్వారా సాంకేతిక శిక్షణ లభించి పరిశ్రమలు ఏర్పడ్డాయి.  చక్కర కర్మాగారాలు , బట్టల మిల్లులు , గోనే సంచుల ఫ్యాక్టరీలు , చిన్న తరహా కుటీర పరిశ్రమలు ఏర్పడ్డాయి.
Future view of Sahu Maharaj

 స్వాతంత్రo గురించి సాహు 1917 , డిసెంబర్ 27 నాసిక్ లో జరిగిన సభలో ' ఇపుడున్న కులవ్యవస్థ యధాతథంగా కొనసాగుతూ ఉండేట్లైతే ఒకవేళ మన చేతికి రాజకీయాధికారం వచ్చినప్పటికీ అదొక నియంతృత్వ రాజ్యం గానే తయారవుతుంది. స్వరాజ్యం పేరిట ఒక నియంతృత్వ రాజ్యం ఏర్పడటాన్ని నిరోధించాలంటే కనీసం పదేళ్ళ పాటు వెనుకబడిన కులాలకు విద్యా , ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కల్పించే విధానం కొనసాగాలి. ' అని అన్నాడు. బొంబాయి ప్రెసిడెన్సి బ్రిటీష్ ప్రభుత్వ సెక్రటరీ లార్డ్ విల్లింగ్టన్ కు 1917 , డిసెంబర్ 29 న లేఖ రాస్తూ ' వెనుకబడిన కులాలను , ముఖ్యంగా అస్పృశ్యులను సామాజికంగా అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గురించి గతంలో నేను ప్రస్తావించి ఉన్నాను. కొత్తగా రూపొందుతున్న భారత రాజ్యాoగం లో ఈ కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించవలసిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అస్పృశ్యులకు సంబంధించి మరింత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం . '  ప్రభుత్వం నియమించబోయే స్థానిక పాలక మండళ్ళలో వెనుకబడిన కులాలకు , అస్పృశ్యులకు తగిన ప్రాధాన్యత కల్పిoచాలని  కోరిండు . ముంబాయిలో కార్మికుల ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతూ ' రష్యా , జర్మనీ , ఇంగ్లాండ్ లలో వలే యుక్త వయసు వచ్చిన ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఉండాలి ' అన్నడు. 

 

1917 లో మరాఠ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ' నేనిక్కడికి ఒక మహారాజ్ గా రాలేదు ఒక సామాన్యుడిగా వచ్చాను. మీరు నన్ను మీలోని ఒక శ్రామికుడిగా , రైతుగా భావించవచ్చు. నా పూర్వీకులు ఇదే పని చేశారు ' అనడం సాహు మహారాజ్ ఎంతటి నిగర్వి , సామాన్య ప్రజలకు ఎంత దగ్గరగా చేరువయ్యాడో అర్థం చేసుకోవచ్చు.  అందుకే ఒక అమెరికన్ చరిత్రకారుడు ఇలా అంటాడు  ' సాదారణ రైతు కుటుంబానికి , వెనుకబడిన కులానికి  చెందిన జ్యోతిబాపూలే సామాజిక ఉద్యమ కారుడు కావడంలో ఆశ్చర్యo లేదు. కానీ ఒక రాజు  అయిన సాహు మహారాజ్ ఇoత నిబద్దతతో సామాజిక ఉద్యమాలను నిర్వహించడం నిజంగా అరుదైన విషయం '. కేవలం మహారాష్ట్ర కే కాకుండా దక్షిణ భారతంలో జస్టీస్ పార్టీ ఉద్యమంతో పాటు  భారతదేశం మొత్తం మీద ప్రభావం చూపిన సాహు మహారాజ్ మే 6 , 1922 న మరణించిండు . అతని మరణాంతరం అంత్యక్రియలు సైతం బ్రాహ్మణేతర పురోహితుల చేత జరిగాయి.

భారతదేశ చరిత్రలో బహుజనులను బ్రాహ్మణుల పెత్తనం నుండి విముక్తి చేయటానికి సైద్ధాంతికంగా., పాలనపరంగా మహాత్మ జ్యోతిబా పూలే., ఛత్రపతి శివాజీల వారసుడిగా కృషి చేసి భవిష్యత్ భారతానికి సామాజిక న్యాయ-ప్రజాస్వామిక తాత్విక పునాదిని ఏర్పరచి ప్రజల రాజుగా మిగిలిపోయిన మహానీయుడు రాజర్షి "ఛత్రపతి సాహుమహారాజ్" గారు.


(ఛత్రపతి సాహుమహారాజ్ ఒక సంస్థానానికి రాజుగా వుండడం వాళ్ళ బహుజనుల బతుకులను మార్చే ప్రయత్నం చేసి మనకు మార్గ నిర్దేశం చేసారు.)

కాబట్టి బహుజనులు ఈ అగ్రవర్ణ కుట్రల్ని గ్రహించి తిప్పికొట్టి ఈ దేశంలో తొలిసారిగా 50%. రిజర్వేషన్స్ కల్పించిన  ఛత్రపతి సాహుమహరాజ్   ఇచ్చిన ' ఎవరి జనాభా ఎంతో..,. వారి వాటా అంత ' అనే నినాధం స్పూర్తిగా , బుద్ధుడు , మహాత్మా జ్యోతిరావు పూలే  , అంబేడ్కర్ , కాన్షీరాం ఆలోచన విధానం లో ముందుకు వెళుదాం...




 

No comments:

Post a Comment

The Chamcha Age Video

Poona Pact