Tuesday, May 16, 2017

PREFACE TO "BUDDHA AND HIS DHAMMA"





# Episode :  01

బహుజన మిత్రులకు బుద్ధ జయంతి జైభీం,
బాబాసాహెబ్ అంబేద్కర్ “BUDDHA AND HIS DHAMMAఅనే పుస్తకం రాయగా అందులోని ‘ముందుమాట’ ప్రచురం చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాలేదు. మరి అందులో #ఏముందో? మీరే చూడండి. దీన్ని ‘జిజ్ఞాస’ ఎపిసోడ్ 1- గా,రోజు (10-05-2017) బుద్దుని 2850వ జన్మదిన సందర్బంగా అందిస్తునాం.  సైన్సు చదివే విద్యార్థులు దీన్ని క్షుణ్ణంగా చదివి అవగాహాన చేసు కోవాలని మనవి,
Eleanor Zelliot అందించిన రాత ప్రతి : బాబాసాహె బ్ అంబేద్కర్గారి మాటల్లో.....
నన్ను ఎప్పుడు అందరు అడిగే ప్రశ్న మీరూ ఇంత చదువు ఎలా చదివారు అని. మరొక ప్రశ్న మీరు బౌద్ధం అంటే ఎందుకు ఇష్టపడతారు అని. నేను ఇండియా లోని ‘అంటరానివారు’ అని పిలవబడే ఒక కమ్యూనిటీ లో పుట్టడం వలన ఈ ప్రశ్నలడుగుతారు. ఈ (పుస్తక) ముందుమాట నా మొదటి ప్రశ్నకు సమాదానం చెప్పడనికి సరైంది కాదు, కాని బహుశా ఇందులో నా  రోండవ ప్రశ్నకు జవాబు చెప్పవచ్చు.
ఆ ప్రశ్నకు నా సమాదానం సూటిగా చెప్పాలంటే “నేను బుద్ధుని దమ్మమే సద్దమ్మమని గట్టిగ నమ్ముతున్నాను”. మరో మతమేదీ, దీనితో సరి పోల్చలేం. ఒక వేళ సైన్సు తెలిసిన నవతరం వ్యక్తికి  ఒక మతం కావాలనుకుంటే, ఖచ్చితంగా అది బుద్ధుని మతమే అవు తుంది. ఈ ధృఢ నమ్మకం నాకు 35 సంవత్సరాలు  అన్ని మతాలను చాల దగ్గరగా చదవడం వల్ల వచ్చింది.
నేను బౌద్ధాన్ని ఎలా చేరాను అన్నది మరొక కథ. బహుశా ఇది చదివవారికి అదేంటో తెలుసు కోవాలన్న కుతూహలం కలగవచ్చు. ఐతే అది ఇలా జరిగింది.
మా నాన్న ఒక మిలటరీ ఆఫీసర్, కాని అదే సమయంలో ఆయన మత ఛాందసం  కలిగిన వ్యక్తి. నన్ను ఆయన చాల ఖచ్చితమైన క్రమశిక్షణతో పెంచారు.నా చిన్నప్పటి నుంచి  మా నాన్న గారి (మతపరమైన)జీవనవిధానం లో అనేకానేక  వైరుధ్యాలను గమనించాను, తన తండ్రి ఒక రామనంది, కాని అయన ఒక కభీర్ పంతి; ఆయన మూర్తి పూజను నమ్మేవారు కాదు, కాని గణపతి పూజ చేసేవారు_ అవును అది మాకోసమే ఐనప్పటికీ నాకు నచ్చలేదు. ఆయన తన పంథికి (ధర్మానికి) సంబందించిన పుస్తకాలు చదివేవారు. అదే సమయం లో నాతోమరియు  మా అన్నయతో  రామాయణ మహాభారత కథలను మా ఇంటికొచ్చిన అక్క చెల్లెండ్ల  కోసం, మరియు ఇతర వ్యక్తులకోసం ఆ కథలు చదివించేవారు. ఇది అలా అనేక సంవత్సరాలు గడిచింది.
నేను ఇంగ్లీషులో 4వ స్టాండర్డ్ పరీక్ష పాసైన సంవత్సరం మా కమ్యూనిటీ ప్రజలు ఒక పబ్లిక్ మీటింగ్ పెట్టి నన్ను అభినందిచాలనుకున్నారు. మిగితా కమ్యూనిటీలతో పోలిస్తే ఇది విజయమే కాదు. కాని నిర్వాహకులకు మా కమ్యూనిటీలో ఈ స్థాయిని చేరుకున్న మొదటి బాలుడ్ని నేనే అనిపించింది. వారికి నేను ఉన్నత స్థాయికి వెళ్ళాను అని అనిపించింది. వారు మా నాన్నను అందుకు అనుమతి అడగాలని వెళ్లారు. అటువంటి ఒక చర్య బాలునిలో తలపొగరు తెస్తుందని చెప్తూ... కుదరదన్నారు మానాన్న. వాడు కేవలం ఒక పరిక్ష పాస్ అయాడు అంతే, అంతకు మించి ఏమి సాధించలేదు కదా అన్నారు. నిర్వాహకులు చాల నిరుత్సాహ పడ్డారు. వారు అంతటితో వదలలేదు, మా నాన్న గారికి మంచి స్నేహితుదడైన  దాదా కేలుస్కర్ ని అడగమన్నారు. అందుకు యన సరే అని, కొంత వాదోపవాదాలు జరిగాక మా నాన్న ఒప్పుకున్నారు. మీటింగ్ దాదా కేలుస్కర్ అధ్యక్షతన జరిగింది. వారు కాలంలో బాగా చదివిన వ్యక్తి. మీటింగ్ చివర్లో యన తను బరోడా సాయాజిరావు ఓరియెంటల్ సిరీస్ కోసం రాసిన ‘బుద్దుని జీవితం’ ప్రతిని బహుమతిగా నాకు బహుకరించారు. ఆ పుస్తకాన్ని నేను ఎంతో శ్రద్దగా చదివాను, అది ఎంతగానో నచ్చింది- నన్ను కదిలించింది.
నేను మా నాన్ననీ   మాకెందుకు   బౌద్ధ సాహిత్యాన్ని పరిచయం చేయలేదని అడగదలిచాను, దీని తరవాత ఆ ప్రశ్న గట్టిగా అడగాలనుకున్నాను. ఒక రోజు  అడిగాను. పదే పదే బ్రాహ్మణా, క్షత్రియ గొప్పతనాన్ని మరియు శూద్రుల, అంటరాని వారి అధో స్థానాన్ని చూపించే కథలైన రామాయణ, మహాభారతాలను ఎందుకు చదవమన్నారు అని అడిగాను. ఈ ప్రశ్న ఆయనకు నచ్చలేదు. “ ఇటువంటి పనికిమాలిన ప్రశ్నలు అడగకూడదు, మీరింకా చిన్నపిల్లలే. మీరు, ఏది చెప్తే అది చేయాలంతే” అన్నారు. ఆయనొక రోమన్ పెట్రియాక్ (పితృస్వామ్యవాది). దాన్ని పిల్లల పైన చాల బలంగా ప్రదర్శించేవారు. తన దగ్గర నాకు మాత్రమే కొంత స్వేచ్చ దొరికేది, నా చిన్నతనంలో మా అమ్మ చనిపోయీ నేను పిన్నతల్లి దగ్గర పెరిగినందున(ఆ  స్వేచ్ఛ దొరికేది).
కొంత కాలం తర్వాత నేను మళ్ళీ అదే ప్రశ్న అడిగాను. అయితే, ఈసారి మా నాన్న తనవద్ద ముందుగానే జవాబు తయారు చేసుకున్నారు. “నేను నిన్ను రామాయణ, మహాభారతాన్ని చదవమనటానికి కారణం, మనం అంటబడని వాళ్ళం కావడం చేత మీలో ఆత్మనున్యతా భావం ఏర్పడే అవకాశం ఎక్కువ, ఇది సహజం. రామాయణ, మహాభారతాల విలువ ఆత్మనున్యతను ప్రాలదోరడం లో ఉంటుంది. ద్రోణుని లేదా కర్ణున్ని చూడు వారు చాల చిన్న వాళ్ళు కాని ఉన్నత స్థానన్నికి చేరారు. వాల్మీకి ఒక కోలి, అయినా రామాయణాన్ని రాశాడు. ఇవి  ఆత్మనూన్యతలను తీసేస్తాయి కనుక నేను మిమల్ని ఇవి  చదవమన్నాను.
మా నాన్న గారి వాదనలో కొంత బలం చూడగలిగాను. కాని, సంతృప్తి చెందలేదు. నేను ఆయనతో అన్నాను “నాకు రామయణ మహాభారతాల్లో ఒక్క పాత్రా కూడా నచ్చలేదు, న్నాకు బీష్మ, ద్రోణ, కృష్ణ ఏవ డూ నచ్చలేదు. బీష్ముడు, ద్రోణుడు పచ్చి హిపోక్రేట్లు , వారు ఏది  చెప్పారో  ఖచ్చితంగా దానికి విరుద్దమైన దాన్నే పాటించారు. కృష్ణుడు ఒక మోసకారి, ఆయన జీవితం అంతా  మోసాలమయం . రాముడు అంటే కూడా నాకు అంతే అయిష్టం ఉంది. శూర్పణఖ విషయంలో కాని, వాలి-సుగ్రీవుల విషయంలో కాని, సీత పట్ల అతడు ప్రదర్శించిన దుర్మార్గపు తీరును కానీ పరిశీలించండి” అన్నాను. మా నాన్న మౌనంగా ఉండిపోయారు. ఆయనకు తెలుసు ఇది ఒక తిరుగుబాటని.
ఈవిధంగా నేను ‘దాదా కేలుస్కేర్’ ఇచ్చిన పుస్తకం ద్వారా  బుద్దుని దారిలోకి వెళ్ళాను.
నేనేం నా చిన్నతనంలో, నాకు బుర్రతక్కువై, తెలియనితనంతో బుద్దున్ని చేరలేదు. నా నిర్ణయం వెనుక అనేక బలమైన ఆలోచనలున్నాయి. మరియు నేను బౌద్ధకథలు చదివినప్పుడు ప్రతిసారి వాటిని సరి పోల్చుకునేవాన్ని. ఇది ‘బుద్ధుడు మరియు అతని ధమ్మం’ రాయడానికి కారణం.
ఈ పుస్తకం రాయాలన్న కోరికకు మూలం వేరే ఉంది. 1951 లో మహాబోధి సొసైటీ వారి జర్నల్ ఆఫ్ కలకత్తా యొక్క సంపాదకుడు వైశాఖ పౌర్ణమిన (బుద్ధ జయంతినాడు)      ఒక ఆర్టికల్ రాయమన్నారు, ఆ ఆర్టికల్ లో  నేను శాస్త్రీయ చైతన్య్యం కలిగిన సమాజం ఒక మతాన్ని అంగీకరించాలనుకుంటే   అది కచ్చితంగా బుద్దుని మతమే అవుతుంది, లేదంటే అది నశిస్తుంది అన్నాను. నేను మరొక విషయం కూడా నొక్కి చెప్పాను. నవయుగ ప్రపంచంలో బౌద్ధము ఒక మతంగా తనను తను రక్షించుకోవలసిన అవసరం ఉంది. అయితే బౌద్ధం నెమ్మదిగా వ్యాపించడానికి లేదా విసృతంగా వ్యాపించక పోవడం వెనుక ఉన్న వాస్తవం ఏమిటంటే, బౌద్ధ సాహిత్యం మొత్తంగా ఒకే దగ్గర లభించకపోవడం. క్రైస్తవులకు ‘బైబిల్’ ఉన్నట్లుగా ఒకటి లేకపోవడం దీనికి పెద్ద వైకల్యం, అని రాసాను. ఈ వ్యాసం ప్రచురితం అయిన తరువాత  నాకు అనేక ఫోన్ కాల్స్, విజ్ఞ్యప్తులు, అభ్యర్ధనలు అనేకం వచ్చాయి, అటువంటి పుస్తకాన్ని ఒకదాన్ని రాయమని వచ్చాయి.  వాటికి ప్రతిస్పందనగా నేను ఈ కర్తవ్యాన్ని చేపట్టాను.
విమర్శకు తావు ఇవ్వకుండా ఉండేందుకు నేను ఖచ్చితంగా చెప్పేది “నేను నా స్వంతంగా ఇందులో ఏది రాయలేదు.” ఇది కేవలం కూర్పు , వివిధ పుస్తకాల నుండి స్వీకరించిన సారమిది. నేను మరి ముఖ్యంగా అశ్వఘోషుని “ బుద్ధ చరిత” నుండి  ఇక్కడ చెప్పదలిచాను. తన కవిత్వాన్ని ఎవ్వరూ అందుకోలేరు, నేను తన భాషను, సరళిని అప్పు తెచ్చుకున్నాను .
నేనంటూ చేసిన పని కేవలం ఒక క్రమపద్దతిగా, అంశాల్ని చెప్పడమే, ఇందులో నేను సరళంగా, తేటతెల్లంగా చెప్పే ప్రయత్నం చేశా. బౌద్దాన్నిఅన్వేషించే విద్యార్ధికి తలనొప్పిని తెచ్చే అనేక అంశాలను నేను ‘పరిచయం’ లో చెప్పాను.
నేను నాకు సహాయం చేసిన వారికీ కృతజ్ఞతలు తెలుపుకోవడం మిగిలి ఉంది. రాత పత్రాల్ని టైపు చేయడంలో భారాన్ని పంచుకున్న సక్రురి గ్రామం, హోషియాపూర్ జిల్లాకు చెందిన నానక్ చంద్ రత్తు గారికి, క్రుద్ధు గ్రామానికి చెందిన ప్రకాష్ చంద్ గారికి నా  ధన్యవాదాలు. ఇది (టైపు చేయడం) వారు అనేక సార్లు చేసారు. శ్రీ నానక్ చంద్  రత్తు, ఈ మహా కర్తవ్యాన్ని పూర్తి చేయడానికి ప్రతిఫలం ఆశించకుండా, తమ ఆరోగ్యాన్ని లెక్కచేయక, ఎంతో కుతూహలంగా ప్రత్యకమైన శ్రమ పడ్డారు. నానక్ చంద్ రత్తు మరియు ప్రకాష్ చంద్ గార్లు ఇద్దరు కూడా వారికి నాపై ఉన్న ప్రేమాభిమానాలు వ్యక్తపరచడంలో భాగంగా ఈ పని చేసారు. వారి శ్రమ తిరిగి ఇవ్వలేనిది. నేను వారికి ఎంతో ఋణపడి ఉన్నాను.
 నేను ఈ పుస్తకం రాయాలనుకున్నప్పుడు  అనారోగ్యంతో ఉన్నాను. ఇప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉన్నాను. ఈ ఐదు సంవ్సరాలు నా ఆరోగ్యపరంగా అనేక ఏత్తు పల్లాలను చూసాను. కొన్ని సందర్బాలలో నేను చాల క్రిటికల్ కండిషన్స్ కి వెళ్ళాను, డాక్టర్లు నా గురించి ఆరిపోయే దీపంలా ఉన్నారని అన్నారు. ఆ ఆరిపోయే దీపం తెరిగి వేలుగుతున్నందుకు కారణం మెడికల్ నైపుణ్యం తెలిసిన నా భార్య మరియు డాక్టర్ మాల్వంకర్ వల్లే. వీరు మాత్రమే నా పని పూర్తి చేయడంలో సహాయపడ్డారు. ఈ పుస్తం యొక్క మొత్తం ప్రూఫ్ రీడింగ్ చేసినందుకు, పొరపాట్లు సరిచేసినందుకు M.B. చిట్నిస్ గారికి నా కృతజ్ఞతలు.
బౌద్ధాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఆ మూడు పుస్తకాలలో ఇది ఒక్కటని చెప్పదలిచాను. మిగిలిన రెండు పుస్తకాలలో ఒక్కటి ‘బుద్దుడు మరియు కార్ల్ మార్క్స్’ రెండొవది ‘రెవల్యూషన్ అండ్ కౌంటర్ రెవల్యూషన్ ఇన్ ఎన్సిఎంట్ ఇండియా’. ఇవి వేరు వేరు భాగాలుగా రాయబడ్డాయి. వాటిని కూడా త్వరలో ప్రచురించాలని ఆశిస్తున్నాను.

బి. ఆర్. అంబేద్కర్,
26-అలిపూర్ రోడ్, ఢిల్లీ
06-04-1956

SHARE చేసి అందరికి పంచండి, జ్ఞానం అందించడంలో భాగం కండి!!!

No comments:

Post a Comment

The Chamcha Age Video

Poona Pact