Monday, July 18, 2022

బహుజన యోధుడు: మన్యవర్ కాన్షీరాం

 అది 1957,, జీవితంలో ఎన్నో సంఘర్షణలు పడి, అవమానాలు ఎదుర్కొని, కష్టపడి, DRDO (Defence Research and Development Organization)లో, 24 సంవత్సరాల నవ యువకుడిగా ఉద్యోగంలో చేరారు కాన్షిరాం.. మహారాష్ట్రలోని, పుణె పట్టణంలో పోస్టింగ్ రావడంతో, తనకు ఎంతో ఇష్టమైన,, తనను కష్టపడి పెంచిన తన తల్లిని, వదలి రాలేక,, కళ్ళ నిండా నీళ్లతో, గుండె నిండా భారంతో పుణె చేరారు కాన్షిరాం.. 
      
సిక్కు మతంలో, కుల వివక్షకు వ్యతిరేకంగా పుట్టిన, రమదాసియా సిక్కు శాఖ, ప్రభావంతో,, చిన్నప్పటి నుండి,, ఆథ్యాద్మిక దారిలో పెరిగిన,, కాన్షిరం,, పుణె వచ్చి రాగానే, తనకు దగ్గరలోని గురుద్వారా ల గురించి ఆరా తీయడం మొదలెట్టారు.. కానీ పుణె పట్టణంలో చూస్తే అంతా చిత్రమైన పరిస్థితి ఉండేది.. ఆఫీస్ లోను, బయటా ఏ దళితుడిని పలుకరించినా, జై భీమ్ అని మొదలుపెట్టి, జై భీమ్ అని ముగించే వాళ్ళు,, ఎవరో బాబా(బాబాసాహెబ్) పేరు విరివిగా వాడేవాళ్ళు.. మొదట్లో ఆయనకు ఇదంతా కొత్తగా అనిపించేది,, ఈ బాబా ఎవరో, గురు రామదాస్ గారికంటే పెద్ద ఆధ్యాత్మిక గురువు లాగా ఉన్నాడే, అనుకునే వారు.. DRDO లో దళిత సంఘాల కార్యకలాపాలు, నినాదాలు, మొదట్లో ఇవన్నీ కొత్తగా ఉండేది..

      ఇదంతా ఒక వైపు అయితే మరోవైపు,, తాను ఈసారి సెలవులకు వస్తే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానని,, కాబట్టి ఎక్కువ సెలవులు పెట్టుకుని రావాలని, కాన్షిరాం గారి తల్లి, ప్రతి ఉత్తరంలో, చెబుతుండేది,, ఈసారి తన తల్లి మాట విని తప్పకుండా పెళ్ళి చేసుకుంటానని, బెంగ పడవద్దని, ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోమని, తల్లిని సముదాయిస్తూ, కాన్షిరం గారు ఉత్తరం రాసేవారు..

కాన్షిరాం గారి జీవితాన్ని మలుపు తిప్పిన సంఘటన: 

        ఈ క్రమంలో ఉండగా, అది 1963 DRDO మొత్తంలో ఒక్కసారిగా హడావిడి మొదలైంది,, దళిత సంఘాలన్నీ ఒకే విషయం గురించి మాట్లాడుకుంటున్నారు,,, ""ఎవరో ఒక 26 సంవత్సరాల మహర్ కుర్రాడు బాబాసాహెబ్ పుట్టిన రోజుకి సెలవు ఇవ్వాలని,, బాల గంగాధర్ జయంతికి, దీపావళికి సెలవులు ఇస్తూ బాబాసాహెబ్ పుట్టిన రోజుకు సెలవు ఇవ్వకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నానని,, బాబాసాహెబ్ జయంతికి సెలవు ఇవ్వకపోతే,, తాను ఉద్యోగానికి రాజీనామా ఇస్తానని, DRDO యాజమాన్యాన్ని బెదిరించడంతో, అతన్నీ DRDO యాజమాన్యం సస్పెండ్ చేసిందట"".. ఆ యువకుడి పెరు "దిన భాన"(ముగ్గురు BAMCEF వ్యవస్థాపకుల్లో ఒకరు).. అతని తరపున All India Federation of Scheduled Caste/Tribes Backward Class & Minorities Employees Welfare Associations, న్యాయ పోరాటానికి దిగింది.. 
         కాన్షిరం గారిలో ఉత్సుకత మొదలైనది,, ఒక వ్యక్తి పుట్టిన రోజు సెలవు కోసం ఇంత పెద్ద ఉద్యమమా,, అసలు ఎవరు ఈ బాబాసాహెబ్ అనే సందేహం మనసుని తొలిచివేయసాగింది.. తాను ఆ మహా ఉద్యమంలో పాల్గొనాలని బలంగా అనిపించింది.. చిన్నప్పటి నుండి ఏ పని చేసినా,, 100% నిబద్ధతతో నిజాయితీగా చేయడం తన తండ్రి దగ్గర నుండి నేర్చుకున్న కాన్షిరాం,, ఆ ఉద్యమంలో పని చేయడం మొదలెట్టారు.. ఆ క్రమంలో ఒక మహార్ బౌద్ధ యువకుడు, కాన్షిరాం లోని కసి, సంకల్ప బలాన్ని గుర్తించి, అతనికి దగ్గర అయ్యాడు.. అతని పేరు,, D. K. కపర్డే (ముగ్గురు BAMCEF వ్యవస్థాపకుల్లో ఒకరు)..
          ఆయన్ని కాన్షిరాం ఉత్సాహంగా బాబాసాహెబ్ గురించి అడగడం మొదలెట్టారు.. ఆయన పుట్టిన రోజు కోసం ఇంత పెద్ద ఉద్యమం చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి అని అడిగారు. కపర్డే నవ్వుతూ చెప్పారు,, ""ఆయన ఆధ్యాత్మిక గురువు కాదు,, ఆయన పూర్తి పేరు బాబాసాహెబ్ అంబెడ్కర్,, నువ్వు నేను ఇక్కడ ఉన్న వీళ్ళందరూ, ఇక్కడ ఉద్యోగం చేయడమే కాదు,, హుందాగా రోడ్డు మీద నడుస్తున్నాం అంటే, మంచి బట్టలు వేసుకుని, గౌరవప్రదమైన జీవితాలు గడుపుతున్నాం అంటే అది ఆయన ఇచ్చిన బిక్షే"" అని చెప్పసాగారు..
           అప్పటిదాకా దళితులకు రిజర్వేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, దళితులకు హక్కులు కల్పించింది కాంగ్రెస్ పార్టీ,, అంటరానితనం నిర్ములనకు హరిజనోద్ధరణ చేసింది గాంధీ,, అని పంజాబ్ లో ప్రచారంలో ఉన్న విషయాలనే నమ్ముతూ,, కాంగ్రెస్ పార్టీ అభిమానిగా ఉన్న కాన్షిరాం లో, మరింత అలజడి మొదలైంది.. బాబాసాహెబ్ అంబెడ్కర్ గురించి మరింతగా తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగింది కాన్షిరాం గారికి.. దాని గమనించిన కపర్డే గారు కాన్షిరాం కు, బాబాసాహెబ్ రాసిన ఒక పుస్తకం బహుమతిగా ఇచ్చారు.. దాన్ని పేరు "కుల నిర్ములన" (Annihilation of Caste) Every BAMCEF Cadre should read this Book.

మొదట్లో దాన్నీ ఒక మాములు పుస్తకంగా భావించి పేజీలు తిప్పిన కాన్షిరాం గారికి ఏమి అర్థం కాలేదు.. తరువాత రోజు ఆఫీసులో అదే విషయాన్ని దిన భాన, కపర్డే లతో చెప్పారు కాన్షిరాం.. వాళ్ళు దాని చారిత్రక నేపథ్యం చెప్పసాగారు.. నిజానికి అది పుస్తకం కాదు అని,, అది ఒక ప్రసంగంలోని పాఠం అని,, "జాత్ పాత్ తొడక్ మండల్" అనే ఒక హేతువాద సామ్యవాద సంఘం వాళ్ళు, బాబాసాహెబ్ ను ఒక సమావేశానికి ఆహ్వానిస్తే, దానికోసం తయారు చేసుకున్న ప్రసంగం అని,, అది ముందుగా వాళ్లకు పంపిస్తే, వాళ్ళు, ఇందులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే, కొన్ని సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బ తింటాయి అని, సమాజంలో అలజడి రేజ్ ప్రమాదం ఉంది అని సాకులు చెబుతూ, కొన్ని లైన్లు తొలగించి ప్రసంగించాలని, బాబాసాహెబ్ ను కోరడంతో,, బాబాసాహెబ్, అందులో ఒక్క లైన్ కాదు కదా,, ఒక్క కామా కూడా మార్చను అంటూ, ఆ సమావేశాన్ని బహిష్కరించి, ఆ ప్రసంగాన్ని ఒక పుస్తకం రూపంలో అచ్చు వేయించారు"" అని చెప్పారు..

       ఆ రోజు రాత్రి అంతా మేలుకొని, ఆ పుస్తకాన్ని, 3 సార్లు చదివారు కాన్షిరాం.. తాను చూసిన సమాజమే,, తనకు ఎదురైన పరిస్థితులే,, కానీ,, తాను ఎప్పుడు ఆలోచించని రీతిలో,, అసలు తన ఆలోచనకే అందని రీతిలో, ఒక క్రమబద్ధంగా పేర్చి, తన ఎన్నో ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు కళ్ళకు కట్టినట్టు అనిపించింది.. చదివినంత సేపు రోమాలు నిక్కబొడుచుకుంటూనే ఉన్నాయి,, శరీరాన్ని ఎదో కొత్త శక్తి ఆవరించినట్లు అనిపించింది.. ఎదో సాధించాలి,, ఎదో మార్పు తీసుకురావాలి,, ఈ సమాజానికి ఎదో చేయాలి అని మనసు పరితపించడం మొదలైంది,, 

       తరువాత రోజు దిన భాన, కపర్డే దగ్గర ఉన్న మరిన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించిన పుస్తకాలు తెచ్చుకుని,, 24 రోజులు సెలవులు పెట్టి చదివారు కాన్షిరాం.. ఈ 24 రోజుల్లో, కొన్ని రోజులు రోజంతా కన్నీళ్లతో ఏడుస్తూ గడిపాడు,, కొన్ని రోజులు అన్నం కూడా తినకుండా చదువుతూ గడిపాడు,, 24 వ రోజున తన తల్లికి ఒక ఉత్తరం రాసారు కాన్షిరాం..

      అమ్మా.. నేను ఇవాళ ఒక మహా వ్యక్తి గురించి తెలుసుకున్నాను.. అంటరాని ప్రజల భవిష్యత్తుకోసం, పీడిత జాతి ముందడుగు కోసం, తన భార్య, నలుగురు పసి పిల్లలు ప్రాణాలు పణంగా పెట్టి, తన జీవితాన్ని ధారపోసిన ఆ మహనీయుడు బాబాసాహెబ్ అంబెడ్కర్ దారిలో నేను నడవాలి అని నిర్ణయించుకున్నాను.. అమ్మా,, ఇక నాకు పెళ్లి సంబంధాలు వెతకడం మానెయ్యి,, నాకు సంపాదనతో ఆస్తులు కూడబెట్టాలి అనే ఆలోచన లేదు,, నా జీవితం, నా సమయం, నా శక్తీ, నా యుక్తి ద్వారా సాధించిన ప్రతి ఫలం, బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్దేశించిన లక్ష్యాల కోసమే నేను ఉపయోగిస్తాను అని నేను నిర్ణయం తీసుకున్నాను.. అమ్మ, ఇకపైన నేను నిన్ను చూడడానికి, మన ఇంటికి కూడా రాకపోవచ్చు,, నీ మనసుకు క్షోభ కలిగిస్తున్నందుకు నన్ను క్షమించి అమ్మ.
ఇది ఆ లేఖ సారాంశం...

 కాన్షీరామే లేకపోతే ఈ దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ,మైనారిటీలకు రాజకీయం అనే మాటే తెలీదు చెంచాగిరి చేయడం తప్ప.
- కాన్షీరాం లేకపోతే అంబేడ్కర్ కు భారతరత్న ఇచ్చేవారే కాదు.

చరిత్రలో మానవులుగా మనుషులతో మన సమాన హక్కుల కోసం పోరాడిన సాధించిన పూలే అంబేడ్కర్, పెరియార్ లాంటి మహానుభావుల ఫోటోలు పెట్టుకొని దేశమంతా పిచ్చివాడిలా తిరిగిన యోధుడు.

రాజకీయరంగంలో చెంచాలుగా మాత్రమే ఉన్న ఎస్సీ, ఎస్టీ,లకు, ఉనికే లేని బీసీలకు మైనారిటీలకు ఒక బీఎస్పీ పార్టీ ఏర్పాటు చేసి వారిని మొట్టమొదటిసారిగా సొంత కాళ్లపై అసెంబ్లీ పార్లమెంట్ మెట్లు ఎక్కించిన వీరాధివీరుడు.

మీరు(దళితులు) పాలక సమాజంగా మారనంతకాలం అవమానించబడుతూనే ఉంటారు అని భవిష్యత్ తరాలను హెచ్చరించిన యోధుడు మన్యవర్ కాన్షీరాం గారు.

No comments:

Post a Comment

PREFACE TO "BUDDHA AND HIS DHAMMA"

# Episode :  01 బహుజన మిత్రులకు బుద్ధ జయంతి జైభీం , బాబాసాహెబ్ అంబేద్కర్ “ BUDDHA AND HIS DHAMMA ” అ...